Dil Raju : ‘యానిమల్’ లాంటి సినిమా తీయడం పెద్ద గొప్పేం కాదు.. సందీప్ వంగా గురించి దిల్ రాజు కామెంట్స్..!

- Advertisement -

Dil Raju : తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది ‘యానిమల్’ . ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా తెలియజేశారు. ‘యానిమల్’ మూవీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిందని అన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకి రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, ఈ వారాంతంలోనే రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు గ్రాస్ అందుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Dil Raju
Dil Raju

దీన్నిబట్టి ‘యానిమల్’ మూవీతో దిల్ రాజుకి భారీగా లాభాలు దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. యానిమల్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “సినిమా గ్లోబల్ అయిందని చెప్పడానికి ఈ సినిమా విజయం ఓ ఉదాహరణ. మన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోల సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

అందరికీ కనెక్ట్ అయ్యేలా చిత్రాలు తీస్తే వాటిని అందరూ ఆదరిస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. యానిమల్ తరహా చిత్రాన్ని మా సంస్థలో కూడా నిర్మిస్తాం” అని అన్నారు. అనంతరం తమ బ్యానర్లో రూపొందుతున్న కొత్త సినిమాల గురించి కూడా స్పందించారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నాలుగు సినిమాలు, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. శంకర్ – రామ్ చరణ్ కలయికలో నిర్మిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here