Bigg Boss : బిగ్ బాస్ హౌస్ నుండి గౌతమ్ అవుట్..13 వారాలకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా?

- Advertisement -

Bigg Boss : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు పరంగా కానీ, క్యారక్టర్ పరంగా కానీ గోల్డ్ అనిపించుకున్న కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. ఈయన హౌస్ లోకి వచ్చినప్పుడు ఈయనెవరో కూడా ఆడియన్స్ కి తెలిసేది కాదు. అసలు ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్ లోకి అడుగుపెట్టి కేవలం తన సొంత టాలెంట్ తో ఆటలు ఆడి, ఈ బిగ్ బాస్ షో ద్వారా లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Bigg Boss
Bigg Boss

గౌతమ్ ముందు ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడే రకం కాదు, ఏదైనా ముఖం మీదనే చెప్పేస్తాడు. హౌస్ లో ఆయనకీ చాలా మంది స్నేహితులు ఉన్నారు కానీ, ‘స్పై’ మరియు ‘స్పా’ గ్రూప్స్ లో లేకుండా సొంత ఆట ఆడుతున్నాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. అలాంటి కంటెస్టెంట్ నిన్న ఎలిమినేట్ అయిపోవడం బిగ్ బాస్ వీక్షకులకు చాలా అన్యాయం అనిపించింది.

ఎలాంటి ఫేమ్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు కాబట్టి గౌతమ్ కి హౌస్ లోకి అడుగుపెట్టే ముందు చాలా రేట్ కి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసింది స్టార్ మా యాజమాన్యం. ఈయనకి ఒక వారానికి గాను కేవలం 30 వేల రూపాయిలు మాత్రమే ఇచ్చారట. అలా ఆయన బిగ్ బాస్ హౌస్ లో 13 వారాలు ఉన్నాడు కాబట్టి, ఈ 13 వారాలకు ఆయన దాదాపుగా మూడు లక్షల 90 వేల రూపాయిలను అందుకున్నాడట.

- Advertisement -

గౌతమ్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పొచ్చు, కానీ ఫేమ్ ప్రకారంగా ఇచ్చారు కాబట్టి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. బిగ్ బాస్ షో తో మంచి పేరు సంపాదించాడు కాబట్టి సినిమాల్లో అవకాశాలు ఇక నుండి గౌతమ్ కి బాగా వస్తాయని, కచ్చితంగా పెద్ద రేంజ్ కి వెళ్తాడు అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here