Surekha Vani : కొంత మంది సెలబ్రిటీస్ సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు,సినిమాల్లో వాళ్లకి అవకాశాలు రాకపోయినప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా హాట్ హాట్ ఫోటోలను మరియు వీడియోలను అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.వారిలో ఒకరు సురేఖ వాణి.
ఈమెకి 45 ఏళ్ళ వయస్సు ఉంటుంది కానీ ఇప్పటికి నేటి తరం యువత కి కనెక్ట్ అయ్యే విధంగా తన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది..ఇప్పటి వరకు ఈమె సుమారుగా 45 సినిమాల్లో నటించింది.2018 వ సంవత్సరం లో విడుదలైన నా నువ్వే అనే చిత్రం తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆమెకి తగ్గ పాత్రలు ఇవ్వడానికి ఇప్పుడొస్తున్న సినిమాల్లో మంచి స్కోప్ ఉన్నా కానీ ఎందుకో దర్శక నిర్మాతలు ఆమె వైపు మొగ్గు చూపడం లేదు.
సురేఖ వాణి తో పాటుగా ఆమె కూతురు సుప్రీత సోషల్ మీడియా లో బాగా పాపులర్.. వీళ్లిద్దరు పార్టీలకు మరియు పబ్బులకు వెళ్లిన ఫోటోలు వీడియోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. రీసెంట్ గా సురేఖా వాణి తన ఇంట్లో స్నేహితులకు ‘గెట్ టూ గెథెర్’ పార్టీ ని ఏర్పాటు చేసింది, ఈ పార్టీలో ఎక్కువగా టీవీ మరియు మూవీ ఆర్టిస్ట్స్ ఉన్నారు, పార్టీ అన్న తర్వాత మందు తాగడం అనేది సర్వసాధారణం. వీళ్ళు కూడా అదే చేసారు, ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి డ్యాన్స్ వెయ్యడమే సోషల్ మీడియా లో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది, దానికి సంబంధించిన వీడియో మీరు కూడా క్రింద చూసేయండి.