Celebrities Talk Shows : టాక్ షో లకు హాజరు అయ్యే గెస్ట్లు డబ్బులు తీసుకుంటారా?

- Advertisement -

Celebrities Talk Shows : ఈ మధ్య అన్ని ఛానెల్స్ టాక్ షో లను చేస్తున్నారు.. అలాగే వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రతి ఛానెల్ కూడా ఇలాంటి షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కాస్త పాపులారిటీని సొంతం చేసుకుంటే చాలు యూట్యూబ్ ఛానల్స్ వారు ఆ సెలబ్రిటీలను తీసుకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇంటర్వ్యూలు అంటే చాలా క్రేజ్ ఉండేది.

కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలకు విలువ లేకుండా పోయింది. అందుకే స్టార్స్ తో టాక్ షో కి హాజరైతే డబ్బులతో పాటు, ఫెమ్ కూడా వస్తుంది.. అందుకే సినిమా ప్రమోషన్ ల కోసం, రాజకీయ కార్యాచరణ కోసం ఈ షోలకు వస్తున్నారు.. విషయానికొస్తే.. పెద్దగా స్టార్లు డబ్బులు తీసుకున్నట్లు ఎక్కడా వినిపించలేదు..

Celebrities Talk Shows
Celebrities Talk Shows

ఎస్.. మీరు విన్నది నిజమే.. స్టార్స్ ఎక్కువ శాతం మంది రెమ్యూనరేషన్ తీసుకోకుండానే టాక్ షోలో పాల్గొంటారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ అన్‌ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రెమ్యూనరేషన్ తీసుకోరు. ఆయనకు రాజకీయంగా పబ్లిసిటీ దక్కుతుంది.. అలాగే ఆయన చేయబోతున్న సినిమాలకు పబ్లిసిటీ లభిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అన్ స్టాపబుల్‌ లో పాల్గొన్నాడు..రాజకీయ భవిష్యత్ కు ఈ షోను వినియోగించు కోవచ్చు కాబట్టి ఆహా వాళ్ళు ఇచ్చినా ఆయన తీసుకోడు..

- Advertisement -
Remuneration for Celebrities to talk shows

అయితే చిన్న నటీనటులు, సెలబ్రిటీలు ఇంటర్వ్యూలో పాల్గొంటే మాత్రం కచ్చితంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. ఇటీవల సుమ అడ్డా కార్యక్రమంలో ఇద్దరు కమెడియన్స్ పాల్గొన్నారు. వారిద్దరికీ రెమ్యూనరేషన్ గా అంతో ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చే సెలబ్రిటీలు కూడా పారితోషికం తీసుకుని మరీ ఇంటర్వ్యూలు ఇస్తారట… మొత్తానికి పెద్దగా స్టార్లు అయితే డబ్బులు తీసుకోరట.. సినిమా రిలీజ్ కు ముందే వచ్చేవాళ్ళు మాత్రం ఆ షో లో కనిపించేందుకు వాళ్ళే ఎంతోకొంత డబ్బులను ఇస్తారని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here