Anchor Jahnavi : ఆ స్టార్ యాంకర్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..?

- Advertisement -

Anchor Jahnavi : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ పాత నటులు ఎప్పుడో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్లీ వెలుగులోకి వస్తున్నారు. టీవీ షోస్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ జాహ్నవి మీకు గుర్తుందా..? యాంకర్ గా మారి స్టార్ హీరోయిన్లు అయిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కొందరు హీరోయిన్లు అవ్వకపోయినా యాంకర్ గా ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు షోల్ లో మాత్రమే కనిపించి ఇమేజ్ ని పెంచుకున్న వాళ్లలో జాహ్నవి ఒకరు. డాన్స్ బేబీ డాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకుంది జాహ్నవి అప్పటి స్టార్ యాంకర్లకి గట్టి పోటీ ఇచ్చింది.

Anchor Jahnavi
Anchor Jahnavi

తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ప్రస్తుతం జాహ్నవి ఏం చేస్తుందో తెలుసా..? టీవీ షోలో ఒకప్పుడు తక్కువగా ఉండేవి. కొందరు యాంకర్స్ ట్యాలెంట్ ని నిరూపించుకునే వారు. టాక్ ఆఫ్ ది టౌన్ తో ఉదయభాను, సుమ అయితే పట్టుకుంటే పట్టు చీర వంటి షోలు చేసేది ఈ టైంలోనే జెమినీ టీవీలో వచ్చిన డాన్స్ బేబీ డాన్స్ షోలో యాంకర్ గా పనిచేసే గుర్తింపు తెచ్చుకున్నారు జాహ్నవి. కొద్ది కాలంలోనే పాపులర్ అయిపోయారు. క్రమంగా జాహ్నవి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయ్యాయి.

గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం మూవీ లో జాహ్నవి నటించింది హీరోయిన్ ఫ్రెండ్ గా ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో నటించింది. ఒకరికొకరు సినిమాలో కూడా ప్రత్యేక పాత్ర చేసింది ఇందులో రైలులో చిన్న పాత్రలో జాహ్నవి నటించింది. తరవాత పెళ్లి చేసుకుంది ఒక బాబు కూడా పుట్టాడు. ఈమె మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఎవరు అనే సినిమాలో రెజీనా కి డ్రెస్ డిజైనింగ్ చేసినట్లు తెలుస్తోంది మరి ఏమి మళ్ళీ సినిమాల్లోకి వస్తుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here