Supritha : ఓరి నాయనో ఇదేం ట్విస్ట్.. సుప్రీత వీడియో లో ఉన్నది నిజామా?

- Advertisement -

Supritha : టాలెంట్ ఉంటే సోషల్ మీడియాలో ఎవరైనా సెలెబ్రేటి అయిపోతారు.. ఇక సెలెబ్రేటీల పిల్లలు ఓ రేంజులో సోషల్ మీడియాను వాడుతున్నారు.. ఈ మధ్య స్టార్స్ కిడ్స్ కు ఇదే ట్రెండ్.. అందరిదీ ఒక ఎత్తు..సుప్రీత ది ఒక ఎత్తు.. సినీ నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… సోషల్ మీడియాలో ఓ రేంజులో ఊపేస్తుంది..ఎప్పటికప్పుడు తన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఆమె వీడియోలు ఏ రేంజులో ఉంటాయో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Supritha
Supritha

తన తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని కూడా సోషల్ మీడియాలోకి తీసుకువచ్చి ఇద్దరూ కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి అందరూ చూస్తూనే ఉన్నాం.. ఈ అమ్మడు పోస్టులకు ఎవరైనా కామెంట్లు పెడితే వారికి ఓ రేంజులో కౌంటర్లు ఇస్తారు.. అయితే ఇప్పుడు ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసింది.. అందులో అమ్మడుకు కడుపు ఉన్నట్లు కనిపిస్తుంది.. దానిపై రకరకాల కామెంట్స్ రావడంతో నెట్టింట ఆ వీడియో ట్రెండ్ అవుతుంది..విషయానికొస్తే.. తాజాగా ఈ భామ సూపర్ హిట్ గా నిలిచిన ధమాకా సినిమాలోని పల్సర్ బైక్ సాంగ్ కి డాన్స్ చేసింది.

ఈ పల్సర్ బైక్ సాంగ్ అనేది శ్రీకాకుళానికి చెందిన రమణా అనే సింగర్ సృష్టించాడు.బుల్లితెరపై ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడిన తర్వాత మంచి క్రేజీ లభించింది. తర్వాత ధమాకా సినిమా యూనిట్ డబ్బులు చెల్లించి సినిమాలో వాడుకుంది. అయితే ఈ పాటకి డాన్సులు వేసిన సుప్రీత తాను టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపోయాను అంటూ కామెంట్ చేసింది. ఈ టమ్మీ టక్కర్ అంటే ఏంటో అందరికి తెలుసు.. చాలా మంది దీన్ని వాడతారు.. అందరూ తినేది జంక్ ఫుడ్ కావడంతో ఉన్న బాడీకి అదనంగా పొట్ట బయటికి తన్నుకొస్తోంది. దీంతో గ్లామర్ ఫీల్డ్ లో వాళ్లంతా ఈ టమ్మీ టక్కర్ వాడుతున్నారు..ఈ అమ్మడు కూడా అది వేసుకోవడం మరిచిపోవడంతో పొట్ట బయటకు వచ్చి కనిపిస్తోంది.. అయినా కూడా ఆ వీడియోను షేర్ చేసింది.. అది కాస్త ఇప్పుడు వైరల్ అవ్వడంతో కడుపు వచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు .. మరి దీనికి సుప్రీత ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆసక్తిగా మారింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here