Rashmi Gautham : వాలెంటైన్స్ డే కి గుండెల్లో గునపం.. సుధీర్ పేరును కన్నీళ్లు పెట్టుకుంటూ చించేసిన రష్మీ..

sudigali sudheer rashmi is breakup


Rashmi Gautham : సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ జంట బుల్లితెరపై ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీళ్ళిద్దరూ కలిసి చేసిన షో ఎంత సక్సెస్ అయ్యాయో అంతకంటే ఎక్కువగా ఈ జంట పాపులర్ అయ్యారు. కాగా ఈ బ్యూటిఫుల్ జోడి విడిపోయినట్లు తెలుస్తుంది.. అందుకు కారణం తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో..

Rashmi Gautham
Rashmi Gautham

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతివారం సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చి బుల్లితెరల ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తోంది.. కాగా ఈ ప్రోమోలో రష్మీ ప్రవర్తన చూసి నెటిజన్లు సుదీర్ అభిమానులు ఒకంత ఫీల్ అయ్యారు. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆది ప్రేమ గురించి చెబుతూ.. ప్రేమంటే గెలవడం కాదని గెలవడం అని అనడంతోనే నవ్వులు పూస్తాయి..

ఫిబ్రవరి 14వ తేదీ కాబట్టి ఒకరికి గట్టిగా ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను అని రష్మీ అనగానే.. హైపర్ ఆది అందుకుని… అది నాకు ఇచ్చేయండి.. అతనికి నేను ఇచ్చేస్తా అని చెబుతాడు. ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా.. బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. ఏదో ఒక రోజు బాబును ఇవ్వడం లాంటిది మాత్రం చేయకు అంటూ హైపర్ ఆది కామెంట్ చేస్తాడు..

sujatha rakesh

రాకేష్ తో సుజాత ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే టామ్ అండ్ జెర్రీ లా ఉంటామని స్టేజిపై లవ్ ప్రపోజ్ చేసుకుంటూ చెప్పారు. ఇక వర్షా ఇమ్మాన్యుయేల్ పేర్లతో ఫ్లేమ్స్ చెక్ చేస్తే మ్యారేజ్ అని వస్తుంది. ఇక్కడ పరదేశి వర్షా కి కూడా మ్యారేజ్ అని వచ్చింది అంటూ నరేష్ బాంబు పేలుస్తాడు

ఆ తర్వాత రష్మీ నీ పేరుతో ఎవరితో చూడను అంటూ సుధీర్ నిక్ నేమ్ అయినా సిద్దు అని రాస్తానని పేరు రాయపోతుండగా.. ఆ పేరుతో ఉన్న పేపర్ ను రష్మీ చించేయడంతోపాటు కన్నీళ్లుగా పెట్టుకుంటుంది. బ్రేకప్ అంటూ ఓ బాంబ్ కూడా పేలుస్తారు. ఇప్పటికే ఈ ప్రోమో మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది.

సుధీర్ రష్మి గౌతమ్ లకు బ్రేకప్ జరగడం వల్లే రష్మీ ఇంతలా బాధపడి ఉంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేదంటే ఎందుకు తన పేరు పక్కన సుధీర్ పేరు రాయటానికి ఒప్పుకోదు అని మరొక వాదన కూడా వినిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలి అంటే వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు. ఈ జంట కలిసి ఉండాలని.. పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.