Supritha : మరో వీడియోతో నెటిజన్లను ఖుష్ చేసిన సుప్రీత.. ఈ భామ అందానికి కుర్రాళ్లు ఫిదా

- Advertisement -

Supritha : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి నటవారసులు కొత్తేం కాదు. చాలా మంది ఇప్పటికే వచ్చారు. కొందరు రాణిస్తున్నారు. మరికొందరు ఫెయిల్యూర్స్​ను తట్టుకోలేక సైలెంట్​గా సైడ్ అయిపోతున్నారు. ఇక ఇండస్ట్రీలోకి వారసుల్లో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువే. అయితే ఓ అమ్మాయి మాత్రం ఇండస్ట్రీలోకి ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు కానీ పాపులారిటీ మాత్రం ఓ స్టార్ హీరోయిన్​కు ఉన్నంత సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలిసిపోయిందనుకుంటా..?

ఇంకెవరండీ.. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణీ కూతురు సుప్రీత. సురేఖా వాణి గురించి తెలియని వారుండరు. తెలుగు సినిమాల్లో అమ్మ, వదిన, సిస్టర్ క్యారెక్టర్స్ లో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ రోల్స్ లో ఆమె తన ప్రతిభ చాటుకుంది. ఇక ఈ భామ తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బుడ్డిబుడ్డి బట్టలేసుకుని పాటలకు స్టెప్పులేస్తూ వ్యూయర్స్​కు మజా అందిస్తుంటారు.

Supritha
Supritha

ఇక సుప్రీత ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ సోషల్ మీడియా ఫాలోవర్స్​ను చూస్తేనే అర్థమైపోతుంది ఈ బ్యూటీకున్న క్రేజ్ ఏంటో. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ.. వీడియోలు.. డబ్​స్మాష్​లు.. రీల్స్​తో అదరగొడుతూ ఉంటుంది సుప్రీత. ఇక ఈ భామ డ్రెస్సింగ్ స్టైల్ అదరహో అనిపించేలా ఉంటుంది. చీర కట్టినా.. వెస్టర్న్ డ్రెస్ వేసిన ఈ బ్యూటీ బ్యూటీఫుల్​గా కనిపిస్తుంది. ఈ భామ అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతూ నెట్టింట తెగ కామెంట్లు పెడుతుంటారు.

- Advertisement -

ఇక తాజాగా సుప్రీత మరో వీడియోతో సందడి చేసింది. తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పింక్ కలర్ శారీలో సుప్రీత సూపర్​గా కనిపిస్తోంది. లూజ్ హెయిర్​తో స్లిమ్ పర్సనాలిటీతో క్యూట్ స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఖడ్గం సినిమాలోని నువ్వూ.. నువ్వూ.. నువ్వే.. నువ్వు అనే పాటకు ఈ బ్యూటీ స్టెప్పులేసింది. ఈ వీడియోలో సుప్రీత ఎక్స్​ప్రెషన్స్​కు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. అందమంటే నీది కాదా.. కాదా.. అంటూ పాటలు పాడేసుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here