దుమ్ము లేపేసిన ‘7/G బృందావన కాలనీ’ రీ రిలీజ్ కలెక్షన్స్.. మొదటి రోజే ప్రభాస్ రికార్డ్స్ అవుట్!7/G Brindavan Colony : ఈమధ్య కాలం లో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ లు మాత్రమే కాదు, చిన్న హీరోల రీ రిలీజ్ లు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నాయి. ముఖ్యంగా ఈమధ్య కాలం లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ రీ రిలీజ్ వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఆల్ టైం టాప్ 3 వసూళ్లను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది.

7/G Brindavan Colony
7/G Brindavan Colony

అప్పటి నుండి టాలీవుడ్ లో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని దక్కించుకున్న చిన్న సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తూ వచ్చారు. తమిళ హీరో సూర్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ మూవీ ని రీ రిలీజ్ చెయ్యగా దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా మరో యూత్ ఫుల్ హిట్ ‘7G బృందావన కాలనీ’ ని నిన్న గ్రాండ్ గా విడుదల చేసారు.

ఈ సినిమాకి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ మొత్తం ఇప్పుడు సరైన సినిమా లేక ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి సమయం లో సరైన సమయానికి వచ్చింది ఈ చిత్రం. సరికొత్త 4K టెక్నాలజీ కి మార్చి, డాళ్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో నిన్న విడుదలైన ఈ చిత్రానికి ప్రధాన నగరాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సినిమాకి స్టార్ హీరో రీ రిలీజ్ కలెక్షన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా వసూలు వచ్చాయి.

వాళ్ళ అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి మొదటి రోజు కోటి రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా సాయంత్రం నుండి అన్నీ చోట్ల ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. సినిమాలేవీ లేకపోవడం తో లాంగ్ రన్ లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.