Michael Review : ఈసారి అయినా ‘మైఖేల్’ తో సందీప్ కిషన్ హిట్ కొట్టేనా?

- Advertisement -

Michael Review : టాలీవుడ్ లో టాలెంట్ ఉంది లక్ కలిసి రాక ఇండస్ట్రీ లో ఎదగలేకపోయిన హీరోల లిస్ట్ తీస్తే అందులో సందీప్ కిషన్ ముందు వరుస లో కనిపిస్తాడు. ప్రస్థానం సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా సందీప్ కిషన్ ఆ తర్వాత ‘వేంకటాద్రి ఎక్సప్రెస్’ సినిమా ద్వారా హీరో గా పరిచమై తొలి సినిమాతోనే భారీ సూపర్ హిట్ అందుకున్నాడు..

కానీ అదే ఆయనకీ ఆఖరి హిట్ గా కూడా నిలిచింది. అప్పటి నుండి విభిన్నమైన పాత్రలు , కథలు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కానీ, సక్సెస్ మాత్రం కలిసి రావడం లేదు.ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే కసి తో పాన్ ఇండియన్ సబ్జెక్టు తో మన ముందుకు ‘మైఖేల్’ అనే చిత్రం ద్వారా వచ్చాడు. భారీ తారాగణం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Michael Review
Michael Review

నటీనటులు : సందీప్ కిషన్ , విజయ్ సేతుపతి , వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, దివ్యంకా కౌశిక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు.

- Advertisement -

నిర్మాతలు : భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు
డైరెక్టర్ : రంజిత్ జయకోడి
మ్యూజిక్ డైరెక్టర్ : సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : కిరణ్ కౌశిక్

మైఖేల్ కథ :

చిన్నతనం నుండి ఎవరికైనా పెద్ద ఇంజనీర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలి. లేదా సినిమా హీరో అవ్వాలి అనే లక్ష్యాలు ఉంటాయి. కానీ మన మైఖేల్ ( సందీప్ కిషన్ ) కి మాత్రం చిన్నప్పటి నుండి గ్యాంగ్ స్టర్ అవ్వాలని కోరిక.పెరిగి పెద్దయ్యాక ఒక గ్యాంగ్ లో చేరుతాడు. ఆ గ్యాంగ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్యాంగ్ స్టర్ రేంజ్ కి చేరుకోబోతున్నాడు అని అనుకుంటున్న సమయం లో అతని జీవితంలోకి తార ( దివ్యాంశ కౌశిక్) వస్తుంది. ఆమె తో ప్రేమలో పడుతాడు మైఖేల్. ఆమె జీవితం లో ఎన్నో మలుపులు. ఇబ్బందులు ఉంటాయి. వాటి వల్ల మైఖేల్ జీవితం ఎలా యూ టర్న్ తీసుకుంది అనేది స్టోరీ.

మైఖేల్ విశ్లేషణ :

ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక క్రైమ్ జానర్ సినిమా అనేది అర్థం అవుతుంది కానీ,కథ గురించి మాత్రం ప్రేక్షకులకు ఎలాంటి క్లారిటీ రాలేదు. డైరెక్టర్ రంజిత్ జయకోడి ఒక స్ట్రాటజీ తోనే ట్రైలర్ ని అలా కట్ చేయించాడని అర్థం అవుతుంది. కానీ అందువల్ల ప్రేక్షకుల్లో కావాల్సిన అంచనాలు మాత్రం సృష్టించడం లో ‘మైఖేల్’ విఫలం అయ్యింది. కేవలం పాన్ ఇండియన్ సినిమా. భారీ కాస్టింగ్ అనే హైప్ తప్ప..కంటెంట్ పరంగా విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్ ద్వారా ఎలాంటి అంచనాలను కూడా క్రియేట్ చెయ్యలేకపోయింది. అందువల్ల ఓపెనింగ్స్ కూడా సాధారణంగానే వచ్చాయి.

ట్రైలర్ లో కథ గురించి చెప్పకపోయినా, సినిమాలో మాత్రం ప్రారంభం పది నిమిషాల్లోనే స్టోరీ లోకి వెళ్ళిపోతాడు డైరెక్టర్. ప్రారంభం లో కాస్త ఆసక్తి ని కలిగించే కథనం ఉన్నప్పటికీ దానిని కొనసాగించడం లో మాత్రం విఫలం అయ్యాడు డైరెక్టర్. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కి కాస్త రిలాక్స్ ఇస్తుంది. సందీప్ కిషన్ నటన పర్వాలేదు.

తాను ముందు సినిమాల్లో పోషించిన పాత్ర తో పోలిస్తే కాస్త డిఫరెంట్ అయ్యినప్పటికీ ఎందుకో అది న్యాచురల్ గా అనిపించలేదు. ఎదో ట్రై చేసాడు అంతే. ఇక హీరోయిన్ తెర మీద చాలా అందంగా కనిపించింది కానీ. యాక్టింగ్ కూడా చేసి ఉంటె బాగుండేది అనిపించింది.. వరుణ్ సందేశ్ కి ఆ పాత్ర అసలు నప్పలేదనే చెప్పొచ్చు. ఇక తమిళ హీరో విజయ్ సేతుపతి కనిపించేది కాసేపే అయినా, ఆయన పాత్ర బాగా పండింది, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన పరిథి మేర బాగానే నటించింది.

ఇక ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఇందులో పోషించిన పాత్ర సినిమాకి హైలైట్స్ గా చెప్పుకునే అంశాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.ఇలాంటి చిత్రానికి మ్యూజిక్ ఆయువు పట్టులాగా ఉంటుంది. కానీ ఈ చిత్రానికి అదే మైనస్ గా మారింది. సామ్ కంపోజ్ చేసిన పాటలు ఒక్కటి కూడా వినసొంపుగా లేవు. కానీ వెండితెర మీద చిత్రీకరణ మాత్రం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

చివరి మాట : ఓవరాల్ గా క్రైమ్ యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వీకెండ్ లో ప్రోత్సహించవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here