Taraka Ratna : బాబాయ్ అబ్బాయ్ ల ప్రేమ, ఆప్యాయతలకు నిలువెత్తు నిదర్శనం ఈ కల్ట్ పిక్స్..లుక్కేయండి.!

Balakrishna Nandamuri Taraka Ratna Cherish moments photos


Taraka Ratna: నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా అడుగుపెట్టిన వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు.. నందమూరి తారక రత్న తన కుటుంబంలో అందరి తో ఎంతో సన్నిహితంగా, సరదాగా ఉంటారు.. ముఖ్యంగా వాళ్ళ బాబాయి అంటే ఎక్కువ ఇష్టం.. బాలయ్య కూడా తారకరత్న అంటే అంతే ఇష్టం.. బాబాయి బాలయ్య తారకరత్న పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Balakrishna Taraka Ratna
Balakrishna Taraka Ratna

తారకరత్న మొదటిసారి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పుడే ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బీట్ చేయలేకపోయారు. 2022వ సంవత్సరంలో ఒకటో నెంబర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమా హిట్ అయిన ఆ తరవాత కెరీర్ లో తడబడ్డాడు.. ఆ తరువాత విలన్ నంది అవార్డు అందుకున్న అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. బిజినెస్ బాట పట్టాడు..

Balakrishna Nandamuri Taraka Ratna Cherish moments photos

అప్పుడే అలేఖ్య రెడ్డిని ప్రేమించడం.. ఇంట్లో వారిని పెళ్లి చేసుకోవడం అన్ని జరిగిపోయాయి.. దాంతో తారకరత్న ఇంటికి దూరంగా ఉంటున్నాడట. కానీ బాబాయి బాలయ్య మాత్రం నీకు నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చి జీవితంలో ముందుకు అడుగేయమని తన వెన్నంటే ఉన్నాడు. తారకరత్న యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయినప్పటి నుంచి బాలకృష్ణ తారకరత్న పక్కనే ఉండి అన్నీ తానై కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సంగతి మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము.. తారకరత్న అంటే తన బాబాయి నందమూరి బాలకృష్ణ కి ఎంత ఇష్టమో మనం ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నాం..

Balakrishna Nandamuri Taraka Ratna Cherish moments photos

ఫిబ్రవరి 22 న తారకరత్న పుట్టినరోజు.. మరికొన్ని రోజుల్లో తారకరత్న పుట్టినరోజు రానుంది. దాంతో నందమూరి బాలకృష్ణ తారక రత్న కలిసి గతేడాది జరుపుకున్న పుట్టినరోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నందమూరి, టిడిపి అభిమానులు..

Balakrishna Nandamuri Taraka Ratna Cherish

ఈ పుట్టినరోజు ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలి ఆ ఫోటోలను మేము ఇంతకంటే ఆనందంగా షేర్ చేసుకుంటాం అంటూ వారిద్దరూ కలిసున్న సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.. ఈ ఫోటోలు చూస్తుంటే బాలయ్య కి తారక రత్న కి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుస్తుంది.. ఆ చెరిష్ మూమెంట్స్ చూసి మీరు ఎంజాయ్ చేయండి..

Nandamuri balakrishna taraka ratna

తారకరత్న కి నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమాలో నటించాలని ఉందని ఎప్పుడో చెప్పారట. తారకరత్న ఈ ఆరోగ్య సమస్య నుంచి బయటపడగానే.. తారకరత్న ఈ నెల ఫిబ్రవరి 22న జరుపుకొబోయే పుట్టినరోజు కి తన సినిమాలో తారకరత్నస్పెషల్ లో నటించనున్నాడని అధికారికంగా అందరి ముందు చెబుతూ.. తారకరత్న కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని బాలయ్య అనుకుంటున్నాడట.