Sumanth Borra : నువ్వే ఒక సైన్యమంటూ అందరి నోటా.. ఇదే పాట

- Advertisement -

Sumanth Borra హాలీవుడ్​లో మొత్తం ఇండిపెండెంట్ సింగర్స్​దే హవా. గ్రూప్, సోలో.. ఇలా రకరకాల ఇండిపెండెంట్ సింగర్స్ తమ సత్తా చాటుతూ ఉంటారు. ఇక బాలీవుడ్​ సంగతికి వస్తే అక్కడ కూడా కొందరు తమ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్​తో సత్తా చాటి నెమ్మదిగా సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. అదే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే ఇండిపెండెంట్ సింగర్స్ చాలా తక్కువ. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది స్వతంత్ర గాయకులు పుట్టుకొస్తున్నారు. తెలుగులో జానపదానికి సంబంధించి చాలా మంది ఇండిపెండెంట్ సింగర్స్ ఉన్న విషయం తెలిసిందే.

Sumanth Borra
Sumanth Borra

అయితే ఇండిపెండెంట్ మ్యూజిక్​లో సత్తా చాటుతున్న తెలుగువాళ్లలో వెంకటేశ్ ఉప్పుల, సుమంత్ సుమంత్ బొర్రా, హనుమాద్రి శ్రీకాంత్, తల్లాడ సాయికృష్ణ గ్రూప్ కూడా ఒకటి. ఈ నలుగురు డిఫరెంట్ కాన్సెప్ట్స్​తో మ్యూజిక్ వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మది దోచేస్తున్నారు. ఇప్పటికే ఈ టీమ్ చాలా పాటలు విడుదల చేసింది. ఇక తాజాగా నువ్వే ఒక సైన్యమంటూ ఈ టీమ్ మన ముందుకొచ్చింది. ఈ పాట ఇప్పటికే యూట్యూబ్​లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

సుమంత్ అండ్ టీమ్ మరొక ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజిషన్​తో అచీవర్స్ అనే సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. ఈ మూవీకి సుమంత్ టీమ్​లో ఒకరైన వెంకటేశ్ ఉప్పల సంగీతం అందించారు. సుమంత్ స్వరపరచగా.. ఈ ఇద్దరూ కలిసే ఈ పాటను ఆలపించారు. హనుమాద్రి శ్రీకాంత్ సాహిత్యం అందించారు. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వచ్చిన అచీవర్స్ సినిమా కోసం ఈ పాటను అందించారు.

- Advertisement -

అచీవర్స్ సినిమా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్​లో జరిగింది. ఈ ఈవెంట్​లో సుమంత్ అండ్ టీమ్​ నువ్వే ఒక సైన్యం అనే పాటను పాడారు. వీరి పాటను విన్న అక్కడున్న వారంతా తన్మయత్వంతో చప్పట్లు కొట్టారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్, తెలంగాణ టూరిజం ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా, సీనియర్ ప్రోడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ డా.చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సుమంత్ బొర్రా, వెంకటేష్ ఉప్పల ఆదిత్య మ్యూజిక్​తో కలిసి చేసిన నాలుో పాట ‘నువ్వే ఒక సైన్యం‘.. వీరి కాంబినేషన్​లో వచ్చిన మొదటి పాట ‘ఎలా మరి ఇక రావా!’. అది యూట్యూబ్​లో మంచి వ్యూస్ ని సంపాదించుకుంది. అలాగే రెండో పాట ‘పడిపోయా’తో యూత్​ను మరోసారి తమ మ్యూజిక్​తో ప్రేమలో పడేలా చేశారు. ఇక మూడో పాట.. ‘విశ్వం’ ఈ సాంగ్​తో అందరి మదిలో అమ్మపై ఉన్న ప్రేమను తట్టిలేపారు. ఇక తాజా పాటతో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపారు.ఈ టీమ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అనతి కాలంలోనే ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలో తమ కంటూ ఓ సిగ్నచేర్ క్రియేట్ చేసుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here