BB Jodi గ్రాండ్ ఫినాలే.. ఒక్కొక్కళ్ళు ఏం చేశారు మామ.. విజిల్స్ వేయాల్సిందే..

- Advertisement -

BB Jodi బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఒక డాన్స్ షో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన డిఫరెంట్ అయితే.. ఇప్పుడు అదే ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చిన బీబీ జోడి సూపర్ సక్సెస్ అయింది టి ఆర్పి రేటింగ్ లో కూడా దూసుకెళ్తోంది.. ఇక ఈ షో గ్రాండ్ ఫినాలే వరకు వచ్చేసింది.. తాజాగా బీబీ జోడీ గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదలగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ గా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వచ్చారు..

BB Jodi
BB Jodi

ఈ గ్రాండ్ ఫినాలే కి ఐదుగురు బీబీ జోడి జంటలు ఎంపికయ్యారు అర్జున్ కళ్యాణ్ వాసంతి, శ్రీ సత్య మెహబూబ్, ఆర్జే సూర్య ఫైమా, ఆర్జే చైతు ఆర్జే కాజల్, అవినాష్ అరియానా.. ఐదుగురు అదరగొట్టేసారు ఒక్కొక్కరి పర్ఫామెన్స్ కి పొంతనే ఉండదు. ఎవరి స్టైల్ లో వాళ్లు కుమ్మేశారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి కావాల్సినంత స్టఫ్ అయితే ఇచ్చారు..‌ ఒక్కొక్క జోడి కళ్ళార్పకుండా చూసేలా పర్ఫామెన్స్ ఇచ్చారు.

jodi

బీబీ జోడి లో గెలుపొందిన జోడికి 25 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అర్జున్ కళ్యాణ్ వాసంతి చేసిన పర్ఫామెన్స్ ఈ ఫినాలే కి హైలెట్ గా నిలిచింది. వీళ్లు ఓ కాన్సెప్ట్ చేసుకొని అద్భుతంగా నరేట్ చేశారు. ఇక వీళ్ల తర్వాత ప్లేస్ లో ఆర్ జె సూర్య ఫైమా పర్ఫామెన్స్ ఉంది. వీళ్లిద్దరి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఈ పర్ఫామెన్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక శేఖర్ మాస్టర్ కూడా అదే అంటూ ఫైమాని హీరోయిన్ గా పెట్టీ సినిమా తీసే రోజు ఓ రోజు కచ్చితంగా వస్తుంది అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

- Advertisement -

మెహబూబ్ శ్రీ సత్య పర్ఫామెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక మెహబూబ్ సిక్స్ ప్యాక్ ని మిస్ అవుతానంటూ సదా అనగానే ఎందుకు మిస్ అవ్వడం వీడియో కాల్ చేసి మాట్లాడండి అంటూ శేఖర్ మాస్టర్ సలహా ఇస్తాడు. ఆ వీడియో కాల్ లో నన్ను కూడా యాడ్ చేయండి అంటూ సీనియర్ హీరోయిన్ రాధా అంటుంది. ఆర్జే కాజల్ చైతు ఇద్దరూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కల్లార్పకుండా చూసేలా చేశారు. అవినాష్ అరియనా ఇద్దరూ ఊ అంటావా మామ పాటకి మిక్స్డ్ సాలిడ్ స్టెప్స్ వేసి స్టేజ్ ని ఓ ఊపు ఊపేశారు. గ్రాండ్ ఫినాలే కి కావలసినంత స్టప్ ఈ ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here