Director Sukumar : దర్శకుడు సుకుమార్పుష్ప ముందు వరకు ఎన్ని సినిమాలు చేసినా వాటిల్లో ఎవర్గ్రీన్ అనగానే టక్కున గుర్తొచ్చేది రంగస్థలం. ఆడియెన్స్ఈ సినిమాకు హార్ట్‌ఫుల్‌గా కనెక్ట్ అయిపోయారు. ఎమోషన్స్, హీరోహీరోయిన్తో పాటు ఇతర యాక్టర్ల నటన సినిమాకు ప్రాణం పోసింది. టాలీవుడ్ రికార్డులను తిరగరాసిందనే చెప్పాలి. ముఖ్యంగా రామ్‌చరణ్, సమంత లుక్స్, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చెవిటివాడిగా చిట్టిబాబు చరణ్, పల్లెటూరి గుడుసు పిల్లగా రామలక్ష్మి సమంత.. ఇద్దరికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. నటులుగా మరో స్థాయికి ఎదిగారు.
అయితే ఈ చిత్రంలో మొదట సమంతను వద్దనుకున్నారట దర్శకుడు సుకుమార్. అయితే తాను ఎందుకు వద్దనుకున్నారో అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఆ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా తెలిపారు. షూటింగ్ సమయంలో సమంత నటన చూసి తాను ఆశ్చర్యపోయినట్లు గుర్తుచేసుకున్నారు. రంగస్థలంలో రామ్ చరణ్అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో ఆయన్ను తప్ప ఇంకొకరిని అస్సలు ఊహించుకోలేమన్నారు.
‘ఈ విషయం చరణ్‌తోనూ చాలా సార్లు చెప్పాను. అయితే మొదటగా ఈ సినిమాలో సమంతను హీరోయిన్గా తీసుకోవాలని అనుకోలేదు. కొత్త అమ్మాయి అయితే ఓకే అనుకున్నాను. ఎందుకంటే హీరో, హీరోయిన్ ఇద్దరూ బడా స్టార్స్ అయితే నేను మేనేజ్ చేయలేనేమో అనుకున్నా. అందుకే రామ్ చరణ్ ఒక్కరు చాలు అనుకున్నా. కానీ ఆ తర్వాత సమంత అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించా సెలెక్ట్ చేశాను. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. నేను సినిమాలు తీసినంతకాలం సమంతను ఎంచుకుంటూనే ఉంటాను. 30, 40 ఏ వయసు వచ్చినా ఆ వయసకు సరిపోయే పాత్ర ఇస్తా. సమంతతో లిప్‌లాక్ సీన్ కూడా కథకు అవసరం అనే పెట్టాను. అందరూ సినిమాను కళాత్మక దృష్టితోనే చూడాలి. ఇంకో కోణంలో చూడటం సరికాదు. ఒక అమ్మాయి, అబ్బాయి చేయి పట్టుకోవడం ఎంత ముఖ్యమో, ముద్దు పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం’ అని చెప్పారు. కాగా, ఈ రంగ స్థలం 2018 మార్చి 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద అదిరపోయే వసూళ్లను సాధించింది.