Mahesh Babu : మహేశ్ బాబు సినిమా రూమర్స్ లో రికార్డు.. ఇప్పటి వరకు లేదు భయ్యా ఇలాంటిది!

- Advertisement -

Mahesh Babu : ఏదైనా పెద్ద హీరో సినిమా స్టార్ట్ అయిందంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ కావడంతో పాటు రూమర్స్ కూడా వినిపిస్తుంటాయి. ఆ హీరోయిన్ తో హీరో రొమాన్స్ చేస్తాడు? అని.. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది? అని రూమర్స్ వినిపించడం కామన్ గా మారింది. కానీ ఓ సినిమా మొదలు కాకుండానే, టైటిల్, లుక్ రిలీజ్ చేయకుండానే రూమర్స్ మీద రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే రాజమౌళి-మహేశ్ కాంబినేషన్ మూవీ! దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించే యోచనలో రాజమౌళి ఉన్నారు.

మొదటి రోజు నుంచి ఈ సినిమాపై రూమర్స్ వినిపించడం సాధారణంగా మారింది. ఈ జానర్ గురించి చాలా పుకార్లు వచ్చాయి. దీంతో చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ అడవి నేపథ్యంలో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ గురించి అనేక రకాల రూమర్స్ వచ్చాయి. దీంతో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని రాజమౌళి ఇటీవల ధృవీకరించారు.

- Advertisement -

కె.ఎల్.నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఓ అంతర్జాతీయ స్టూడియోతో కలిసి నిర్మించి మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే చిత్రబృందం, లొకేషన్స్ గురించి కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఈ సినిమా బడ్జెట్ కూడా ఇంకా డిసైడ్ కాలేదు కానీ బడ్జెట్స్, వర్కింగ్ డేస్ గురించి మాత్రం కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి అండ్ టీం మీడియాతో ముచ్చటించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ కు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.. ఇన్ని రూమర్స్ రావడం ఇప్పటి వరకు ఏ సినమాకు జరగలేదంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here