Jr Ntr: నటన మరియు డ్యాన్స్ కి కేవలం అభిమానులు మరియు ప్రేక్షకులు మాత్రమే కాదు, టాలీవుడ్ లో సెలెబ్రిటీలు కూడా ముగ్దులు అయిపోతారు అనే విషయం తెలిసిందే.టాలీవుడ్ లో నటన మరియు డ్యాన్స్ లో ఎవరు ఇష్టం అని అడిగితే ప్రతీ ఒక్కరు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తారు.ఇక డ్యాన్స్ పరంగా అయితే ఇండియాలో ఉన్న టాప్ 5 డ్యాన్సర్స్ లో ఒకడిగా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా నిలుస్తాడు.

అయితే ఆయన డ్యాన్స్ కి అభిమానులు అయిన ఎంతో మంది సెలబ్రిటీస్ లో ఒకరు అలనాటి స్టార్ హీరోయిన్ రంభ.ఈమె జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి యమదొంగ అనే చిత్రం లో ‘నాచోరే నాచోరే’ అనే బ్లాక్ బస్టర్ సాంగ్ లో డ్యాన్స్ వేసింది.ఈ పాట అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అప్పటి నుండే రంభ ఎన్టీఆర్ డ్యాన్స్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయింది.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఎన్టీఆర్ డ్యాన్స్ ని మరోసారి పొగడ్తలతో ముంచి ఎత్తేసింది.ఆమె మాట్లాడుతూ ‘ఈ ప్రపంచం లో అందరికీ మైఖేల్ జాక్సన్ ఇష్టమైన డ్యాన్సర్ అవ్వొచ్చు, కానీ నాకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటేనే ఇష్టం.అతని డ్యాన్స్ ని రోజు మొత్తం చూస్తూ కూర్చోమన్నా చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.

రంభ నేటి తరం హీరోలలో ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్ వంటి డ్యాన్సర్ తో కలిసి ఆడిపాడింది.కానీ ఆమె ఎన్టీఆర్ డ్యాన్స్ అంటేనే ఇష్టం అంటూ మాట్లాడడం ఇప్పుడు పెద్ద చర్చ కి దారి తీసింది.ఇక నటనలో నేటి తరం హీరోలలో మహేష్ బాబు మరియు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే ఈ ఇద్దరి హీరోల సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది రంభ.
