Vijaya Shanthi ని రిస్క్ చేసి కాపాడిన‌ స్టార్‌ హీరో.. అప్ప‌ట్లో సినిమాకు 5వేలే

- Advertisement -

హీరోయిన్ అంటే కేవలం హీరోల పక్కన డ్యాన్స్ వెయ్యడానికి, రొమాన్స్ చెయ్యడానికి మాత్రమే కాదు, హీరోలతో సమానంగా స్టార్ స్టేటస్ కూడా సంపాదించగలడు అని నిరూపించిన స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది విజయ శాంతి Vijaya Shanthi మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో దాదాపుగా ప్రతీ స్టార్ హీరో సరసన నటించిన విజయ శాంతి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.

Vijaya Shanthi
Vijaya Shanthi

ఆరోజుల్లో ఈమె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు అప్పటి టాప్ 2 స్టార్ హీరోలైన చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలతో పోటీపడేవి.వాళ్లతో సమానంగానే ఈమె డ్యాన్స్ మరియు ఫైట్స్ కూడా చేసేది.అందుకే ఈమెని లేడీ అమితాబ్ బచ్చన్ అని అందరూ అంటూ ఉండేవారు,అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి తో సమానంగా కోటి రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక స్టార్ గా చరిత్ర సృష్టించిన విజయ శాంతి ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసి అందులో కూడా రాణించింది.

ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు విరామం ఇచ్చిన విజయ శాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది,అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి చెప్పుకోగా అవి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

- Advertisement -

ఆమె మాట్లాడుతూ ‘నా చిన్న తనంలోనే తల్లితండ్రులు చనిపోయారు.అప్పటి నుండి నా సొంత కష్టం తోనే ఇక్కడ దాకా వచ్చాను,నేను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు నాకు తొలుత నిర్మాతలు కేవలం 5 వేల రూపాయిలు మాత్రమే ఇస్తాము అనేవారు.. ఆ 5 వేల రూపాయిలు కూడా పూర్తిగా ఇచ్చేవాళ్ళు కాదు, సగం ఎగొట్టి మూడు వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు,అలాంటి స్థాయి నుండి కోటి రూపాయిల వరకు పారితోషికం అందుకునే హీరోయిన్ గా ఎదిగాను.

నేను షూటింగ్స్ సమయం లో చాలా సార్లు చావు వరకు వెళ్లి వచ్చాను, ఒక తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొన్న నేను ఒక పూరి గుడిసెలో ఉండగా, ఆ గుడిసెకి నిప్పు పెట్టాలి.. ఆ సమయం లో గాలి బాగా వీయ‌డంతో నిప్పు రవ్వ నా చీర మీద ప‌డి చీర కాలిపోయింది, మంటలు పెద్దగా రావడం తో అందరూ నన్ను చూసి పారిపోగా, విజయ్ కాంత్ గారు మాత్రం రిస్క్ చేసి మంటల్ని ఆర్పి నా ప్రాణాలను కాపాడాడు’ అంటూ చెప్పుకొచ్చింది విజయ శాంతి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here