Namrata Shirodkar : ఇన్​స్టాలో సూపర్ స్టార్ కృష్ణ రీల్ వైరల్.. షేర్​ చేసిన నమ్రతతెలుగు సినిమా ఇండస్ట్రీ వీరుడు, సాహసి సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్​ తెరపై ఎన్నో సాహసాలకు మారుపేరు. ఇండస్ట్రీకి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు. దాదాపు 350కిపైగా సినిమాలతో హిస్టరీ క్రియేట్ చేసిన హీరో. తెలుగు తెరకు జేమ్స్ బాండ్​ను పరిచయం చేసిన ఓ గూఢచారి. అలాంటి సూపర్ స్టార్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఘట్టమనేని ఫ్యామిలీ, ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కృష్ణ దశ దిన కర్మను నిర్వహించి ఆయన అభిమానులను ఆహ్వానించారు. మీ అభిమానం తోడుగా ఉండాలి అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు మహేష్‌బాబు. కృష్ణ ఎప్పుడు మీ గుండెల్లో.. నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పారు.

Namratha / krishna
Namratha / krishna

మరోవైపు నమ్రత సోషల్ మీడియా వేదికపై తన మావయ్య సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు నమ్రత. “ఎవర్‌గ్రీన్ స్టార్. ఎన్నింటికో పునాదులు వేసి నిజమైన ట్రెండ్‌సెట్టర్ గా నిలిచారు.. సినిమాపై ఆయనకున్న ప్రేమ ఆయన్ను సూపర్ స్టార్‌గా మార్చింది. మీ నుంచి జీవితంలోని ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నాను. ఆయన అపూర్వ వారసత్వాన్ని, ఖ్యాతిని ఎప్పటికీ మేం పండగాల జరుపుకూనే ఉంటాం. లవ్ యూ మామయ్య గారూ.” అంటూ కృష్ణ సుధీర్ఘ జర్నీకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక తండ్రి దూరమైన తర్వాత సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు మహేష్. “నీ జీవితం వేడుకగా గడచిపోయింది. నీ నిష్క్రమణం కూడా అంతే వేడుకగా సాగింది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ స్వభావం.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ లేని శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను.. అచ్చం మీలాగే.. నీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను.. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను… లవ్ యూ నాన్నా… మై సూపర్ స్టార్” అంటూ ట్వీట్ చేశారు.

Super star Krishna

అంతకుముందు మహేశ్ బాబు కూతురు సితార, కొడుకు గౌతమ్​లు కూడా తమ తాత మరణం గురించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు షేర్ చేశారు. సితార తన తాత కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ‘ఇకపై వీకెండ్ లంచ్‌లు ఇంతకు ముందున్నట్టుగా ఉండవు.. మీరు నాకు ఎన్నో విలువలు నేర్పించారు.. నన్ను ఎప్పుడూ నవ్విస్తూనే ఉండేవారు.. ఇక ఇవన్నీ నాకు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి.. మీరే నా హీరో.. నేను ఏదో ఒక రోజు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాననే నమ్మకం నాకుంది.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను తాత గారు’ అంటూ సితార ఎమోషనల్ పోస్ట్ వేసింది.

కృష్ణ కూతురు మంజుల కూడా తన తండ్రి మీదున్న ప్రేమను కురిపించింది. ‘డియర్ నాన్నా.. మా ప్రపంచానికి మీరే సూపర్ స్టార్.. అయితే ఇంట్లో మాత్రం మాతో ఎప్పుడూ ఓ సాధారణ వ్యక్తిలానే ఉన్నారు.. మాకోసం ఎప్పుడూ నిలబడ్డారు.. ఎంత బిజీగా ఉన్నా కూడా మాకోసం టైం కేటాయించారు.. మాకేం కావాలో చూసుకున్నారు.. ఎలా బతకాలో మాకేం ఉపన్యాసాలు కూడా ఇవ్వలేదు.. మీరు చేసే పనుల ద్వారా మాకు ఎలా ఉండాలో చెప్పకనే చెప్పేశారు. మీ సంప్లిసిటీ, హుందాతనం, తెలివి, క్రమశిక్షణ, సమయపాలన ఇలా అన్నీ ఉండటం చాలా అరుదు.. మీరు సినిమా పరిశ్రమకు చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం. మీరే మా బలం.. మీరే మాకు సర్వస్వం.. మీరే నా హీరో.. మీది సముద్రమంత ప్రేమ. మాకేం కావాలో మాకు తెలియకపోయినా.. మాకేం అవసరమో మీరు గుర్తించి ఇచ్చారు.. మిమ్మల్ని నేను దారుణంగా మిస్ అవుతున్నాను. రాత్రి పూట కూడా మనం ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం.. అది ఇప్పుడు మిస్ అవుతున్నాను.. లంచ్, లంచ్‌లోని చర్చలు ఇవన్నీ మిస్ అవుతాను’.. అంటూ ఎమోషనల్ అయింది.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)