RRR Sequel : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా టాలీవుడ్ సత్తాను ప్రపంచ వేదికపై చాటింది. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు కేవలం ఇండియాలోనే కాదు హాలీవుడ్‌లోనూ మార్మోగింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిభకు హాలీవుడ్ దర్శకులు, నటులు ఫిదా అయ్యారు. ఇక ఎన్టీఆర్, చరణ్ యాక్టింగ్‌కు ప్రపంచ దేశాల ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు.

ఎన్నో ఏళ్ల ఆస్కార్ కలను ఆర్ఆర్ఆర్ సాకారం చేసింది. ఎన్నో అంతర్జాతీయ సినీ వేదికలపై పురస్కారాల పంట పండించింది. రికార్డులలో ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటికీ ఏ సినిమా అందుకోలేకపోయింది. ఇలా ప్రతి విషయంలోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. హిస్టరీ క్రియేట్ చేసింది. విడుదలై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రతిరోజూ ప్రపంచంలో ఏదో మూల ఈ సినిమా ప్రస్తావన వచ్చి తీరుతుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయంపై రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు జక్కన్న నోరు విప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రం సీక్వెల్‌పై రాజమౌళి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
మార్చి 18వ తేదీన జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ షోకు సినిమా దర్శకుడు రాజమౌళి గెస్ట్‌గా హాజరయ్యారు. తెలుగు సినిమాలపై ప్రత్యేక అభిమానం చూపించే జపాన్ ప్రేక్షకులు ఈ విజవల్ వండర్‌కు ఫిదా అయ్యారు. అయితే ఈ స్క్రీనింగ్‌కు వెళ్లిన జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌కు సంబంధించిన ప్రశ్న మరోసారి ఎదురైంది. అయితే ఈసారి జక్కన్న సూటిగా సమాధానం చేప్పేశాడు. “నాకు సినిమా గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ వాటిని ప్రస్తుతం మీతో చెప్పలేను” అని అసలు సంగతి ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం జక్కన్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అయ్యాక జక్కన్న ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై కాన్సంట్రేట్ చేస్తాడని నెటిజన్లు అంటున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించారు. వీరి నటనకు గ్లోబల్ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్, సినీ సెలబ్రిటీలు మెస్మరైజ్ అయ్యారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు అందించారు. ఆయన అందించిన సంగీతానికి గానూ (నాటు నాటు పాటకు) ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటించారు. సీనియర్ నటులు శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.