Guntur Kaaram సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండగ కారణంగా రెండు మూడు రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టింది కానీ, నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో రెండవ రోజు నుండే వసూళ్లు లేవని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక ఈరోజు నుండి ఈ చిత్రానికి షేర్ వసూళ్లు రావడమే కష్టమే అని, దాదాపుగా కలెక్షన్స్ క్లోజ్ అయ్యినట్టే అని కూడా అంటున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన మూడేళ్లు డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది. అంటే మూడేళ్ళ పాటు మహేష్ బాబు వెండితెర పై కనిపించడు అన్నమాట.
ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా మొదలు పెట్టే ముందే మేము రెండు పాటలు బలంగా ఉండాలని కోరుకున్నాం. ఆ రెండు పాటలకు డ్యాన్స్ అదిరిపోవాలి అని ప్లాన్ చేసుకున్నాం.
ఈరోజు సినిమా విడుదలై మొదటి పాటకు, అలాగే ‘కుర్చీ మడతపెట్టి’ పాటకి ఆ రేంజ్ రెస్పాన్స్ రావడాన్ని చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది.ఎందుకు నేను డ్యాన్స్ ఉండే పాటలు కోరుకున్నాను అంటే, మళ్ళీ నేను ఇలాంటి కమర్షియల్ తెలుగు సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇదే నా చివరి తెలుగు సినిమా కూడా అవ్వొచ్చు, ఎందుకంటే ఇక నుండి అన్నీ పాన్ ఇండియా లెవెల్ లో ఉంటాయి కాబట్టి’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఆయన మాట్లాడిన ఈ మాటలు విని ఇక మహేష్ ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూడలేమా అని ఫ్యాన్స్ నిరాశని వ్యక్తం చేస్తున్నారు.