Janhvi Kapoor కు శ్రీదేవి వాటి గురించి సీక్రెట్స్ చెప్పేదా.. అవి తెలుసనే జాన్వీ రెచ్చిపోతుందా..

- Advertisement -

Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి అందానికి అడ్రస్‌ లాంటివారు. అందుకే ఆమెను అతిలోక సుందరి అంటారు. ఆమె సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమె అందానికి, అభినయానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె అందాన్ని వారసత్వంగా తీసుకున్న జాన్వీ కపూర్‌ కూడా ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్‌ ఒక బ్యూటీ సీక్రెట్‌ను పంచుకుంది. అది కూడా వాళ్ల అమ్మ (శ్రీదేవి) చెప్పిన రహస్యమట. తాను ఇంత అందంగా మిలమిల మెరిసిపోవడానికి కారణం ఆమె తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్‌ అని చెప్పుకొచ్చింది. ‘మా అమ్మ.. బ్రేక్‌ఫాస్ట్‌లో తినగా మిగిలిపోయిన పళ్ల ముక్కలతో అప్పటికప్పుడే అక్కడికక్కడే మొహానికి మసాజ్‌ చేసుకుని ప్యాక్‌లా వేసుకునేది. ఓ పదిహేను నిమిషాలు ఆగి కడిగేసేది.

sridevi janhvi kapoor
sridevi-janhvi kapoor

అప్పుడు చూడాలి అమ్మ మొహం.. మిలమిల మెరిసిపోయేది. ఇప్పుడు నేనూ అదే ఫాలో అవుతున్నా. బ్రేక్‌ఫాస్ట్‌లో మిగిలిపోయిన పండ్ల ముక్కలే నా బ్యూటీ సీక్రెట్‌’ అని జాన్వీ కపూర్‌ తెలిపింది. జాన్వీ కపూర్ కెరీర్ పరంగా బాగా స్పీడ్ పెంచింది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను పొందిన ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తోంది.అది కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ దేవర అనే సినిమాలో నటిస్తుంది.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో ఆమె బిజీ బిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here