Jahnvi Kapoor : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి చుక్కలు చూపించిన పోలీసులు..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి యూత్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈమె పేరు చెప్తే వెర్రిక్కిపోతారు. ఇప్పటి వరకు ఈమెకి ఇండస్ట్రీ లో ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా కూడా ఈమెకి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం ఆమె అందమే అని అంటుంటారు.

Jahnvi Kapoor
Jahnvi Kapoor

ప్రస్తుతం ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న ‘దేవర ‘ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే ఆమెకి తెలుగు లో మొట్టమొదటి సినిమా. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తో నటించే ఛాన్స్ రావడం జాన్వీ కపూర్ అదృష్టం అనే చెప్పాలి. ఈ చిత్రం హిట్ అయితే టాలీవుడ్ లో ఆమె శ్రీలీల హవా కి బ్రేక్ పెట్టేయగలదు. అంత రేంజ్ ఉంది.

Jahnvi Kapoor  Black Dress

ఇకపోతే సోషల్ మీడియా లో ఈమె ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె ప్రమేయం లేకుండా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ అవుతుంటాయి. రీసెంట్ గా ముంబై విమానాశ్రయం లో జాన్వీ కపూర్ కి ఎదురైనా ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఒకప్పుడు సెలబ్రిటీస్ ని వీసా, పాస్ పోర్ట్ మరియు బోర్డింగ్ పాస్ ఇవేమి చెక్ చెయ్యకుండానే పంపేవారు పోలీసులు. కానీ ఈమధ్య ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అన్నీ చెక్ చెయ్యాల్సిందే. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు అయ్యింది. ఇప్పుడు జాన్వీ కపూర్ కి కూడా అలాంటి పరిస్థితి ఎదురు అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here