దడ పుట్టిస్తున్న శ్రీముఖి రేటు.. వామ్మో అంటున్న జనాలు

- Advertisement -

బుల్లితెర యాంకర్ శ్రీముఖి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మొదట యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె దాని అనంతరం పలు సినిమాల్లో సైతం నటించింది.జులై, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, నేను శైలజ, జెంటిల్మెన్ వంటి పలు సినిమాలలో నటించింది శ్రీముఖి . ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ వెండితెరపై తను అనుకున్నంత సక్సెస్ను సాధించలేకపోయింది శ్రీముఖి . దాంతో యాంకర్ గా బుల్లితెరపైనే సెటిల్ అయ్యింది.

శ్రీముఖి
శ్రీముఖి

బుల్లితెరపై ఇప్పటివరకు ఉన్న యాంకర్లలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న యాంకర్లలో శ్రీముఖి కూడా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. సాధారణంగా శ్రీముఖి ఏదైనా ఈవెంట్ లేదా ఒకరోజు షూటింగ్ చేసినట్టే ఖచ్చితంగా దాదాపుగా 3 లక్షలకు పైగానే తీసుకుంటుందట.అంతేకాదు శ్రీముఖి సంపాదన ముందు హీరోయిన్లు సైతం పనికిరారు అన్న కామెంట్లు సైతం వినపడుతున్నాయి. సుమ తర్వాత యాంకర్ గా శ్రీముఖికి ఉన్న క్రేజ్ మరో యాంకర్ కి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కోరోజు రెండు మూడు షోలు కూడా చేస్తుంటుంది శ్రీముఖి. ఇక ఈ లెక్కన ఈ రాములమ్మ రెమ్యునరేషన్ ఎంతో మీరే లెక్కేసుకోండి.

అయితే రియాలిటీ షో అయిన బిగ్ బాస్ వంటి షోలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది శ్రీముఖి. అనంతరం బ్యాక్ టు బ్యాక్ టీవీ షో లతో మరింత బిజీగా మారింది. యాంకరింగ్ తో పాటు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సినిమాల్లో సైతం మెరుస్తూ తన సత్తా చూపెడుతోంది. అయితే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. తన అందాల ఆరబోతులో ఎలాంటి హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తోంది శ్రీముఖి. హాట్ ఫొటోలతో ఊరిస్తూ ఉంటుంది. ఇలా ఫొటోలు పెట్టి చూపిస్తుంటే ఎంత పారితోషికమైనా ఇస్తారులే అంటున్నారు నెటిజన్లు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here