జాకెట్ తీసేసి ఉండడమే మన సంప్రదాయం.. మరో వివాదంలో సింగర్ చిన్మయి

- Advertisement -

సినీరంగంలో పరిచయం అవసరం లేని పేరు సింగర్ చిన్మయి. సమంతకు డబ్బింగ్ చెప్పిన ఈ సింగర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా మహిళల హక్కులు, సెక్స్, నెపొటిజం, కాస్టింగ్ కౌంచ్ లాంటి వాటి విషయంలో.. వెంటనే స్పందిస్తుంది స్టార్ సింగర్. అంతే కాదు. సోల్ మీడియా వేదికగా ప్రశ్నించడం.. గట్టిగా నిలదీయ్యడం. తిట్టడం ఇలా చాలా రాకాలుగా చిన్మయి ఫేమస్. ఇలా స్పందిస్తుంది కాబట్టే.. వివాదాస్పద సెలబ్రిటీగా ఆడియన్స్ కు ఆమె గుర్తుండిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో.. స్పందిస్తూ.. సోషల్ మీడియాల యాక్టీవ్ గా ఉండే చిన్మయి.. తాజాగా మరో వివాదాస్పంద వ్యాఖ్యలు చేశారు.

singer chinmayi

డ్రెస్​ల మీద చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారని ఒక యువకుడు ఓ వీడియో షేర్ చేశాడు. వాళ్లు ఎలాగూ వేసుకోవడం లేదు కాబట్టి.. తాను వేసుకుంటానని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గురించి సినిమా ఈ తనదైన శైలిలో స్పందించింది. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ కల్చర్ గురించి తెలుసుకోవాలని తెలిపింది. మన భారతీయ సంస్కృతి లో మన పూర్వీకులు బ్లౌజులు ధరించేవారు కాదని, ఆడవారు జాకెట్ వేసుకోకపోవటమే మన భారతీయ సంస్కృతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి మనదేశంలో ఆడవాళ్లు వేసుకునే జాకెట్ కల్చర్​ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పింది.

Chinmayi

ఇండియన్ కల్చర్ తెలియదా నీకు? చున్నీ వేసుకోవేలా? ఇటువంటి బొక్కలు.. ఇటువంటి డొక్కలు.. వాంతి వచ్చే ఐడియాస్ ఇచ్చేవాళ్లు ముందు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోండి. మీరు కూడా పంచెలు కట్టుకోండి. అదే కదా కల్చర్.. మరి ఫ్యాంట్‌లు షర్ట్‌లు ఎందుకు వేసుకుంటున్నారు. అంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనిపై కొందరు సింగర్ చిన్మయి ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. కొందరు ఆమె ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here