Sreeleela : రెడ్ సూట్​లో బాస్​ లేడీలా శ్రీలీల రావిషింగ్ లుక్స్

- Advertisement -

టాలీవుడ్​లో మోస్ట్ హాప్పెనింగ్ బ్యూటీ శ్రీలీల వరుస అవకాశాలతో జోరుమీద ఉంది. ఓవైపు సినిమా షూటింగులు.. మరోవైపు ప్రమోషన్స్.. ఇంకోవైపు ప్రైవేట్ ఈవెంట్స్​కు అటెండ్ అవుతూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామకు క్రేజ్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ కోసం తరచూ తను అప్డేట్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ భామ నాటీనెస్​కి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఇక క్యూట్ క్యూట్​గా శ్రీలీల మాట్లాడే మాటలకు మెస్మరైజ్ అవుతుంటారు.

తాజాగా శ్రీలీల తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్ ఫొటోలను పోస్టు చేసింది. ఇందులో రెడ్ కలర్ సూట్​లో యాపిల్ పండులా మెరిసిపోతోంది. బాస్ లేడీ వైబ్స్ ఇస్తూ తన క్యూట్ స్మైల్​తో మతిపోగొడుతోంది. శ్రీలీల లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఈ భామను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్ ఏ క్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత క్యూట్​గా ఉంటే ఎలాగమ్మా అంటూ కొంటెగా రియాక్ట్ అవుతున్నారు. ఇక కుర్రాళ్లైతే శ్రీలీలపై తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు.

ఇక శ్రీలీల సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. టాలీవుడ్​లో ఉస్తాద్ భగత్​ సింగ్, అనగనగా ఒక రాజుతో పాటు కన్నడలో జూనియర్, దుబారి చిత్రాలు చేస్తోంది. ఇక ఈ ఏడాది గుంటూరు కారంతో శ్రీలీల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో తన డ్యాన్స్​తో అదరగొట్టింది. ముఖ్యంగా మహేశ్​బాబుతో కలిసి మిర్చి యార్డ్​లో వేసిన స్టెప్పులు సినిమాకే హైలైట్. ఇక కుర్చీ మడతపెట్టి పాట గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో శ్రీలీల గ్లామర్​కు నెటిజన్లు ఫిదా అయ్యారు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here