Sreeleela ఎలాంటిదో రవితేజకు ఇప్పుడు అర్థమైందిట

- Advertisement -

Sreeleela : మాస్‌ మహారాజా రవితేజ, అందాల నటి శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన సినిమా ధమాకా. చాలా రోజుల తర్వాత రవితేజకు ఈ సినిమా ద్వారా పెద్ద హిట్‌ దక్కింది. క్రాక్‌ తర్వాత మధ్యలో రెండు సినిమాలు బోల్తా కొట్టడంతో ఢీలా పడిన ఈ ఎనర్జటిక్‌ స్టార్‌.. ధమాకాతో మళ్లీ ఊపు మీదున్నాడు. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద సక్సెస్‌ సాధించింది. తాజాగా రిలీజైన రావణాసుర చిత్రం ప్లాఫ్ టాక్ మూట కట్టుకుంది. ఈ నేపధ్యంలో ధమాకా లో శ్రీలీల విషయం హాట్ టాపిక్ గా మారింది.

Sreeleela
Sreeleela

వాస్తవానికిడి ధమాకా సినిమా అంత పెద్ద హిట్టవడానికి కారణం అందులోనే పాటలు. అలాగే శ్రీలీల కూడా. తన అందం అభినయంతో అధ్భుతంగా నటించి సినిమా హిట్టయ్యేందుకు చాలా కష్టపడిందనేది అందరూ ఒప్పుకునే విషయం. రావణాసుర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉండగా… శ్రీలీల రేంజ్ హీరోయిన్ లేదని మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. శ్రీలీల ఉండటం వల్లనే ధమాకా హిట్టైందని, లేకపోతే ఆ సినిమా రావణాసుర లా మారేదని అంటున్నారు. గతంలో శ్రీలీలపై రవితేజ ప్రశంసలు కూడా కురిపించాడు. ఆమె డ్యాన్స్‌లు అద్భుతం. తెలుగులోనే కాదు ఆమె ఇండియన్‌ సినిమాలోనే పెద్ద స్టార్‌ అవుతుందని చెప్పాడు.

Sreeleela  Ravi Teja

ఇక రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’ సరిగా ఓపెనింగ్ తెచ్చుకోకపోవడం వల్ల శ్రీలీలకి క్రేజ్ పెరగడం చెప్పుకోదగ్గ విషయం. దీంతో ఆమెకి జనంలో బాగా క్రేజ్ ఉందని అర్థమవుతోందని తేల్చేస్తున్నారు. రవితేజ కూడా ఈ విషయం రియలైజ్ అయ్యాడని, తన తదుపరి సినిమాల్లో శ్రీలీల ను తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు టాక్ మొదలైంది. మొత్తానికి శ్రీలీల సంగతి ఇప్పటికైనా రవితేజకు అర్థమైందని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు శ్రీలీల చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here