Sreeleela : శ్రీలీలకు స్టార్ హీరో స్ట్రాంగ్ వార్నింగ్..ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేవంటూ..

- Advertisement -

శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్​లో బాగా వినిపిస్తున్న పేరు. ఈ బ్యూటీ తెలుగులో చేసింది ఒక సినిమాయే అయినా వరుస ఆఫర్లు తలుపుతడుతున్నాయి. మొదటి మూవీ కూడా అంతగా హిట్ కాకపోయినా Sreeleela చేతిలో ఇప్పుడు నాలుగైదు మూవీస్ ఉన్నాయి. ఓవైపు బాలకృష్ణ లాంటి అగ్రహీరో.. మరోవైపు రవితేజ లాంటి బ్లాక్​బస్టర్ హిట్స్​ ఉన్న హీరో.. ఇంకోవైపు రామ్ లాంటి యంగ్ హీరోలతో ఆడిపాడే అవకాశాలు దక్కించుకుంటోంది.

శ్రీలీల.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందDతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోష‌న్​తో శ్రీలీల ఇందులో రొమాన్స్ చేసింది.

ఈ సినిమాను పోయినేడాది 2021 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. గతంలో పెళ్లి సందడి సంగీతం అందించిన కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్ ఈ సినిమాకు కూడా పని చేయడం విశేషం. తండ్రి శ్రీకాంత్ నటించిన టైటిల్‌తో తనయుడు రోషన్​ హీరోగా నటించడం మరో విశేషం. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కూడా కీలక పాత్రలో కనిపించి అదరగొట్టారు.

- Advertisement -
Sreeleela

ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. పెళ్లి సందD సినిమాలో నటించినందుకు శ్రీలీలకు మంచి పేరొచ్చింది. ఆ మూవీలో ఈ భామ బాగానే అందాలు ఆరబోసింది. చూడ్డానికి ముద్దుగా బొద్దుగా అందంగా కనిపించడంతో పాటు తన నటన, డ్యాన్సులతో అదరగొట్టింది. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ బ్యూటీ టాలెంట్ చూసిన డైరెక్టర్లు మాత్రం వరుస ఆఫర్లు ఇచ్చేస్తున్నారు.

పెళ్లిసందD తర్వాత శ్రీలీలకు మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’లో ఆఫర్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే బాలకృష్ణ-అనిల్ రావిపూడి మూవీలో అవకాశం వచ్చింది. బాలయ్య బాబు సినిమా గురించి చర్చలు జరుగుతండగానే రామ్-బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇలా వరుస ఆఫర్లతో శ్రీలీల బిజీబిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్​గా మారింది. చేతినిండా సినిమాలు ఉన్న ఈ బ్యూటీకి మరో స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చాడట. కానీ కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక అంతకు ముందు ఓకే చేసిన మరో స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటోదట. ఈ విషయాన్ని శ్రీలీల డైరెక్టర్​కు కూడా చెప్పిందట. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నాననని చెప్పుకొచ్చిందట.

ఈ విషయం తెలుసుకున్న హీరో డైరెక్ట్​గా శ్రీలీలకు ఫోన్ చేశాడట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తనలాంటి స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేయడమేంటని వార్నింగ్ కూడా ఇచ్చాడట. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది మామూలు విషయం కాదు. దీనికోసం ఎంతగానో శ్రమించాలి. వచ్చిన మంచి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే… ఓ పదో పన్నెండో సినిమాలు చూసి… కెరీర్ ముగించాల్సి ఉంటుంది.’ అని స్ట్రాంగ్​గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here