పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం శ్రీలీల అంత డిమాండ్ చేస్తుందా..? మరీ దారుణం..

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్రో’ చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. కేవలం రెండు మూడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ తప్ప పవన్ కళ్యాణ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయ్యిపోయినట్టే.ఈ సందర్భంగా ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉంది మూవీ టీం. కొద్దిరోజుల క్రితమే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ని విడుదల చెయ్యగా, కాసేపటి క్రితమే ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ ని విడుదల చేసారు.

శ్రీలీల
శ్రీలీల

దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మార్క్ స్వాగ్ మరియు స్టైల్ ఈ పోస్టర్ లో కనిపించింది.ఆయన లుక్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆయనకీ ఇది పవన్ కళ్యాణ్ తో మూడవ సినిమా, ఈ చిత్రం లో మొత్తం 5 పాటలు ఉంటాయట. అందులో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటుంది. ఈ ఐటెం సాంగ్ కోసం ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీలీల ని అడుగుతున్నారట. ప్రస్తుతం మూవీ టీం ఆమెతో చర్చలు జరుపుతుండగా, ఐటెం సాంగ్ చేసేందుకు గాను శ్రీలీల ఏకంగా రెండు కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల వరకు తీసుకుంటుంది. అలాంటిది ఆమె కేవలం ఒక ఐటెం సాంగ్ కోసం రెండు కోట్ల రూపాయిలు డిమాండ్ చెయ్యడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. మా హీరో సినిమాలో నటిస్తూ, ఐటెం సాంగ్ కోసం ఇంత డిమాండ్ చేస్తావా అంటూ శ్రీలీల పై విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here