Sreeleela : రవితేజ చిత్రం లో శ్రీలీల చైల్డ్ ఆర్టిస్టుగా నటించిందా..ఇన్ని రోజులు ఎవ్వరూ గమనించలేదుగా!

- Advertisement -

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం యంగ్ హీరోయిన్ శ్రీలీల కాల్ షీట్స్ కోసం యుద్దాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే ఆమె ఏ స్టార్ హీరోయిన్ కి కూడా సాధ్యపడని స్టార్ డమ్ ని సంపాదించింది. ఆమె అద్భుతమైన డ్యాన్స్ మరియు అందం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఆమెకి ఆఫర్స్ రావడానికి కారణం అయ్యాయి. సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా, శ్రీలీల డ్యాన్స్ వేస్తే చాలు థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు జనాలు.

Sreeleela
Sreeleela

మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం లో కూడా ఈమె వేసిన డ్యాన్స్ స్టెప్పులకు థియేటర్స్ పై కప్పులు లేచిపోయాయి. ఫలితంగా ఆ చిత్రానికి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇది ఇలా ఉండగా శ్రీలీల రవితేజ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది.

ravi teja Sreeleela

అదేమిటంటే రవితేజ నటించిన ఒక సినిమాలో శ్రీలీల ఒక చిన్న పాత్ర పోషించింది అట. కన్నడలో శివరాజ్ కుమార్ హీరో గా ‘వజ్రకాయ’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ లో రవితేజ చిన్న గెస్ట్ రోల్ చేసి శివరాజ్ కుమార్ తో కలిసి డ్యాన్స్ వేస్తాడు. ఆ సినిమాలో శ్రీలీల చైల్డ్ ఆర్టిస్టుగా ఒక్క చిన్న రోల్ లో కనిపించింది. ఈమె చిన్నతనం లో చాలా సినిమాలే చేసింది.

- Advertisement -

అందులో అంజలీ ప్రధానపాత్రలో నటించిన ‘చిత్రాంగద’ చిత్రం లో కూడా బాలనటిగా ఒక రెండు నిమిషాల పాటు కనిపిస్తుంది. అలా ఆమె తళుక్కుమని బాలనటిగా మెరిసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా రవితేజ గెస్ట్ రోల్ లో కనిపించిన సినిమాలో బాలనటిగా నటించిన శ్రీలీల, ఆయనతోనే కలిసి ‘ధమాకా’ చిత్రం లో హీరోయిన్ గా నటించడం విశేషం. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి మరో సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించబోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here