Sonam Kapoor : ఎర్రగౌనులో మెరిసిపోయిన బాలీవుడ్ దివా సోనమ్ కపూర్



బాలీవుడ్ బ్యూటీ, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ( Sonam Kapoor ) అహూజా ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. అందమైన ఔట్‌ఫిట్‌లో.. అంతకుమించిన తన అందంతో అందరినీ కట్టిపడేసింది. సౌదీ అరేబియాలోని జడ్డా నగరంలో రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సోనమ్‌ పాల్గొని సందడి చేసింది. ప్రముఖ డిజైనర్‌ రామి కది రూపొందించిన ఎరుపు రంగు పొడవాటి గౌను ధరించిన సోనమ్‌.. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ అందరినీ ఆకర్షించింది.

Sonam Kapoor
Sonam kapoor

ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను సోనమ్‌ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతకు ముందు వానిటీ ఫెయిర్‌ డిన్నర్‌లో సోనమ్‌ పసుపు రంగు దుస్తులు ధరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తల్లి అయిన తర్వాత మొదటిసారిగా సోనమ్‌ ఇలా కనిపించడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ‘వావ్.. సూపర్‌..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Sonam Kapoor photos
Sonam Kapoor

గత ఏడెనిమిది నెలలుగా సోనమ్ ఇలాంటి అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో కనిపించలేదు. దాదాపు ఏడు నెలల తర్వాత సోనమ్ తన ఫ్యాషన్ ప్రపంచంలోకి మళ్లీ అడుగుపెట్టింది. ప్రెగ్నెన్సీ వల్ల తనకు నచ్చిన దుస్తులు వేసుకోవడం కుదరలేదు సోనమ్‌కు. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత సోనమ్ మొదటి సారిగా ఓ ఫంక్షన్‌కు అటెండ్ అయింది.

Sonam Kapoor latest photos
Sonam Kapoor

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్‌ కపూర్‌ సావరియా మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. చేసింది పది వరకు సినిమాలే అయినా ప్రతీ సినిమా ఓ అద్భుతమనే చెప్పాలి. మూస ధోరణిలో వెళ్లకుండా కంటెంట్ ఉన్న సినిమాలకే సోనమ్ జై కొడుతుంది. ముఖ్యంగా ఆ మూవీలో తన పాత్ర హైలైట్ ఉండేలా చూసుకుంటుంది

sonam kapoor
ఐషా, ఐ హేట్ లవ్ స్టోరీస్, కూబ్‌ సూరత్, రాంఝనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో, నీర్జా, ఏక్ లడ్‌ కీ కో దేఖా తో ఐసా లగా, ద జోయా ఫ్యాక్టర్ లాంటి సినిమాలతో సోనమ్ ప్రేక్షకులను అలరించింది. ద జోయా ఫ్యాక్టర్ సినిమా తర్వాత మళ్లీ సోనమ్ ఇంకే సినిమా ఒప్పుకోలేదు. తండ్రి అనిల్ కపూర్ నటించిన ఏకే వర్సెస్ ఏకేలో క్యామియో రోల్ చేసింది.

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో 2018లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజాను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ఏడాది ఆగ‌స్టు 20న ఆమె పండంటి మ‌గ‌బిడ్డ వాయుకు జ‌న్మనిచ్చింది.

Tags: