Sonakshi Sinha : మంచుకొండల్లో ఎంజాయ్ చేస్తున్న దబంగ్ బ్యూటీ



Sonakshi Sinha : బాలీవుడ్ దబంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన తెరంగేట్రమే బాలీవుడ్ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌తో చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. ఓవైపు సల్మాన్ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతో జత కడుతోంది.

Sonakshi Sinha
Sonakshi Sinha

తాజాగా ఈ బ్యూటీ డబుల్ ఎక్స్‌ఎల్ అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో లావుగా ఉన్న అమ్మాయిలు ఇంట్లో, సమాజంలో ఎదుర్కొనే సమస్యల గురించి చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో సోనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Sonakshi Sinha
Sonakshi Sinha

సోనాక్షి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌. ఈ బ్యూటీ తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరలో ఉంటుంది.

Sonakshi Sinha
Sonakshi Sinha

తాజాగా సోనాక్షి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ న్యూ ఇయర్‌ని ఫిన్‌లాండ్‌లో ఫొటోషూట్‌తో ప్రారంభించింది. మంచు కొండల్లో సేద తీరుతూ భలే ఎంజాయ్ చేసింది.

Sonakshi Sinha

అందాలలో అహో మహోదయం అంటూ సోనాక్షీ తెల్లగుర్రంతో పోజ్ ఇచ్చింది. మంచులో ఆటలాడుతూ న్యూ ఇయర్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది.

Tags: