‘గుంటూరు కారం’ టీజర్ లో మీరెవ్వరు గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

- Advertisement -

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘గుంటూరు కారం’ టీజర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ లో వింటేజ్ మహేష్ బాబు లుక్స్ మరియు ఆయన మార్క్ మాస్ స్వాగ్ మరియు స్టైల్ ని చూసి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇలాంటి మహేష్ బాబు ని కదా ఇన్ని రోజులు మనం చూడాలనుకుంది అంటూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు.

గుంటూరు కారం
గుంటూరు కారం

శ్రీమంతుడు సినిమా నుండి మహేష్ బాబు వరుసగా సబ్టెల్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్ కి చిరాకు రప్పించేసాడు.హిట్ సినిమాలు అయితే వస్తున్నాయి కానీ, మహేష్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం తగలడం లేదు. స్టామినా మొత్తం వృధా అయిపోతుందే అని బాధపడేవాళ్లు. ఆ బాధలకు ఎదురుచూపులు ఇక తెరపడినట్టే, మాస్ మహేష్ వచ్చేసాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Mahesh Babu

అయితే ఈ సంబరాల్లో మునిగిపోయి ఫ్యాన్స్ ఈ టీజర్ లోని కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించలేకపోయారు. ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ లో ఎక్కడా ఆయన కనిపించలేదే అని అనుకున్నారు. కానీ టీజర్ మహేష్ బాబు తొడ కొట్టినప్పుడు కార్ గాల్లోకి లేచే సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ టీజర్ లో మహేష్ కి కుడివైపు జనాలతో పాటుగా చెవులు గట్టిగా మూసుకొని జగపతి బాబు నిలబడి ఉంటాడు. ఆయనని మీరు కూడా క్రింద చూడవచ్చు.

- Advertisement -
Guntur Karam

ఇలా ఈ చిన్న షాట్ లో జగపతి బాబు ని ఇరికించేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయనకీ కూడా ఒక పూర్తి స్థాయి షాట్ పెట్టి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఇక అభిమానులు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే క్యాప్షన్. ‘ది హైలీ ఇన్ ఫ్లేమబుల్’ అనే క్యాప్షన్ గతం లో ఎన్టీఆర్ హీరో గా నటించిన రాఖీ సినిమాకి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి అదే క్యాప్షన్ పెట్టారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here