తెల్ల చీరలో ఫొటోస్ పెట్టిన కృతి శెట్టి.. శోభనమా అంటూ కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు

- Advertisement -

ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ భామ నటించిన ది వారియర్, మాచర్ల నియోజక వర్గం ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా కస్టడీతో ప్రేక్షకులను పలకరించింది. అదీ కూడా నిరాశే మిగిల్చింది.

కృతి శెట్టి
కృతి శెట్టి

కెరీర్‌ బిగినింగ్‌లో హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసిన కృతిశెట్టికి ఇలా వరుసగా హ్యాట్రిక్‌ ఫ్లాపులు రావడంతో తెగ ఆందోళన చెందుతోందట. వరుసగా ప్లాపులు రావడంతో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకో సినిమా కనుక ప్లాప్ అయితే ఆమె కెరీర్ డేంజర్‌లో పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం కృతి చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల ఫలితంపైనే కెరీర్‌ ఆధారపడింది.

తాజాగా బేబమ్మ పంచుకున్న ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. వైట్ ప్రింటెడ్ శారీలో కృతి శెట్టి అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో హోయలు పోయింది. మత్తెక్కించే ఫోజులతోనూ మైమరిపించింది. నిషా కళ్లతో, ఊరించే పెదవులతో మంత్రముగ్ధులను చేసింది. బేబమ్మ వరుసగా చీరకట్టులో మెరుస్తుండటంతో నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో ఫొటోలను సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు. మరికొందరేమో శోభనమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here