Sobhita Dhulipala : అజంతా శిల్పంలా శోభిత అందాలు.. అదరహో అంటున్న నెటిజన్లు

- Advertisement -

Sobhita Dhulipala ఈ తెలుగందం ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. అయితే సినిమాల కంటే ఈ భామ ఇప్పుడు పర్సనల్ లైఫ్ వల్ల ఎక్కువగా లైమ్ లైట్ లో ఉంటోంది. టాలీవుడ్ హ్యాండ్సమ్ నాగచైతన్యతో ఈ బ్యూటీ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. విదేశాల్లో ఈ జంట కలిసి చక్కర్లు కొడుతున్నట్లు ఫొటోలు బయటకు రావడంతో ఇది నిజమేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే దీనిపై ఈ ఇద్దరు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Sobhita Dhulipala
Sobhita Dhulipala

శోభిత తెలుగమ్మాయే అయినా ఈ భామ తెరంగేట్రం చేసింది మాత్రం హిందీ సినిమా ఇండస్ట్రీలో. రామన్ రాఘవ్ అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ అడపా దడపా సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తోంది. చేసింది కొన్ని సినిమాలే అయినా శోభిత తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఇక ఈ భామ గూఢచారి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ తర్వాత అడవి శేష్ తోనే మేజర్ సినిమాలో సందడి చేసింది.

Sobhita

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను పంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈసారి ఈ భామ చీరలో కనువిందు చేసింది. పీచ్ కలర్ శారీలో శోభిత ఎల్లోరా శిల్పాన్ని తలపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Dhulipala
sobhita dhulipala

ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు శోభితపై మనసు పారేసుకుంటున్నారు. చీరలో ఈ భామ  అందాలు అద్భుతమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నడుం చూపిస్తూ.. ఆ వొంపులతో టెంప్ట్ చేసిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక డీప్ నెక్ బ్లౌజ్ లో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చగొడుతోందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు.  

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here