Akira Nandan : ఫ్లైట్ లో దొంగగా మారిన అకీరానందన్.. ఏం దొంగతనం చేశాడో తెలుసా?

- Advertisement -

Akira Nandan : తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ ల ముద్దుల కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నాడు. అకీరా నందన్ ఎక్కడ కనిపించినా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మీడియా అంతగా ఫెమస్ చేస్తుంది..అప్పుడే మెగా అభిమానులు అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు అంటూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే అకీరా నందన్ ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్, సంగీతంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టాడు.. అలా ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న అకీరా తాజాగా ఓ దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యాడు.. ఆ విషయాన్నీ తన తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంది.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Akira Nandan
Akira Nandan

పవన్, రేణు దేశాయ్ విడిపోవడంతో అకీరా ఎక్కువగా తన తల్లితోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక వీలుచిక్కినప్పుడల్లా హైదరాబాద్ కు వస్తుంటాడు. తన తండ్రితో, తన మెగా ఫ్యామిలీతో గడుపుతుంటాడు.. ఇక వీలుచిక్కినప్పుడల్లా హైదరాబాద్ కు వస్తుంటాడు. తన తండ్రితో, తన మెగా ఫ్యామిలీతో గడుపుతుంటాడు. ఇటీవల ఖుషి రీరిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే.ఇక రేణు దేశాయ్ తరచుగా తన కుమారుడి విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అకీరా ఏం చేసినా మురిసిపోతూ ఉంటుంది.

తాజాగా అకీరా వేసిన దొంగ వేషాలని రేణు దేశాయ్ బయట పెట్టింది. అకీరా ఏకంగా ఫ్లైట్ జర్నీలో దొంగతనం చేశాడట. అయితే ఆ దొంగతనం చేసింది తన దగ్గరే అని రేణు దేశాయ్ తెలిపింది..అకీరాకి కావలసిందల్లా దొరుకుతుంది. అన్ని కాస్ట్లీ వస్తువులు ఉంటాయి. అయినా ఎందుకు దొగతనం చేశాడు అనుకుంటున్నారా. ఫ్లైట్ లో అకీరా ఉపయోగించే ఇయర్ ఫోన్స్ బ్యాటరీ అయిపోయిందట. పక్కనే కూర్చుని ఉన్న రేణు దేశాయ్ దగ్గర పాత ఇయర్ ఫోన్ సెట్ ఉంటే సైలెంట్ గా వాడుకున్నాడని రేణు తెలిపింది.. ఆ వీడియో పై ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు మెగా ఫ్యాన్స్.. అకీరా సినీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

https://www.youtube.com/watch?v=5LBUTPhAI-Y
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here