Mrunal Thakur: హీరోలు వద్దు.. హీరోయిన్స్ కావలని షాక్ ఇచ్చిన మృణాల్

- Advertisement -

Mrunal Thakur: ‘సీతా రామం’తో అందరి మనసుల్లో చెదరని ముద్ర వేసుకుంది హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ఈ సినిమా తర్వాత మంచి చిత్రాలను ఎంపిక చేసుకొని నటిస్తోంది. ఈ అమ్మడు నటించిన తాజా బాలీవుడ్‌ చిత్రం ‘గుమరాహ్‌’ (Gumraah). ఇందులో మృణాల్‌ పోలీస్‌ పాత్రలో అలరించనుంది. ఆదిత్య రాయ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదలవ్వనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Mrunal Thakur
Mrunal Thakur

తనకు సమంత అంటే చాలా ఇష్టమని తనతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇదే విషయం మీద వరుసగా నాలుగు ట్వీట్లు చేసింది. ఇది చూసిన వాళ్లు సమంత ఏమైనా హీరోనా ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అని గుసగుసలాడుకుంటున్నారు. లేటెస్ట్ గా ట్విట్టర్ లో ఆస్క్ సామ్ అనే హ్యాష్ ట్యాగ్ లో తన అభిప్రాయం తెలిపింది. సమంతను ఉద్దేశిస్తూ మృణాల్ ..‘శాకుంతలం సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆతృతగా ఉన్నారు. సామ్.. మీరు చాలామందిని ఇన్స్ స్పైర్ చేస్తున్నారు అంటూ ఎంతో ఎగ్గైటింగ్‌గా చెప్పుకొచ్చింది.

samantha

ఇక ఈ ట్వీట్లకు సమంత కూడా రిప్లై ఇచ్చింది. మనిద్దరం కలిసి సినిమా ఎప్పుడు చేద్దాం.. ’అంటూ ప్రశ్నించిన సీతారామం బ్యూటీకి.. సమంత కూడా వెంటనే రియాక్ట్ కావడం విశేషం. ‘ఈ ఐడియా నాకు నచ్చింది. “#Gumraah beautiful @mrunal0801కి అభినందనలు . మీరూ ఈ ఐడియా చాలా నచ్చింది.!!” అంటూ రిప్లై ఇచ్చింది సమంత. మృణాల్ ప్రశ్నకు సమంత సమాధానం చెప్పడం నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక నెటిజన్ .. ‘వావ్ మీ ఇద్దరూ కలిసి నటిస్తే.. ’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే సమంతకు కూడా మృణాల్ తో నటించడం ఇష్టమే అన్నట్టుగా ఉంది. అందుకే వెంటనే రియాక్ట్ అయింది అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here