Sitara సూపర్ స్టార్ మాహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..తండ్రి మహేష్ పాటలకు డాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది సితార.. త్వరలోనే సినిమాల్లోకి రానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సితూ పాపకు మహేష్ బాబు కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఉన్నారన్న విషయం తెలిసిందే..నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది సితార. సితారకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగు సంవతస్సరాది ఉగాదిని పురస్కరించుకుని సితార పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా ముస్తాబైంది.

సితార కుందనపు బొమ్మ లా ముస్తాబైన ఫోటోను షేర్ చేసి మురిసిపోయారు నమ్రత. అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సితార ఉగాది వేడుక ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి..ఈ వీడియెకి బ్యాక్ గ్రౌండ్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు’ లోని మెలోడీ సాంగ్ ప్లే అవుతుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. సర్కారు వారి పాట మూవీలో ‘పెన్నీ’ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది.
ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు..ఇటీవల నమ్రత పిల్లలతో పాటు విదేశాలకు వెళ్లారు. త్రివిక్రమ్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ ఈ ట్రిప్ మిస్ అయ్యాడు. సాధారణంగా మహేష్ ఫ్యామిలీ ట్రిప్స్ అసలు మిస్ కారు. ఎక్కడికెళ్లినా మహేష్, నమ్రత, తమ ఇద్దరు పిల్లలు కలిసే వెళతారు. ఆగస్టు నెలలో మూవీని విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నారు.. ఆ తర్వాత జక్కన్న సినిమాను పట్టాలెక్కించనున్నారు.. ఏది ఏమైనా సీతు పాప ఫోటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి…పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా తయారైందని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లతో మరింత వైరల్ చేస్తున్నారు..