Kalpika Ganesh : టాలీవుడ్ నటి కల్పిక ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్.. అదే కారణమా..!టాలీవుడ్ నటి కల్పిక.. అదేనండీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీలో సమంత అక్కగా నటించింది కదా ఆమెనే. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచతమే. ప్రయాణం నుంచి ఈమె సినీ ప్రయాణం మొదలైంది. రీసెంట్​గా యశోద మూవీ వరకు సాఫీగా సాగుతోంది. Kalpika Ganesh చేసిన క్యారెక్టర్లు సపోర్టింగ్​వే అయినా తన పాత్రలో వెయిట్ ఉండేలా చూసుకుంటుంది ఆమె. ఉన్న కాస్త స్క్రీన్​ స్పేస్​లోనే తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది. తెరపై కనిపించే పది నిమిషాలైనా ప్రేక్షకుల మైండ్​లో ముద్ర పడేలా చూసుకుంటుంది.

సినిమాల్లోనే కాదండోయ్ ఈ బ్యూటీ రియల్ లైఫ్​లోనూ కాస్త డేరింగ్ అండ్ రెబల్. ముక్కు సూటిగా మాట్లాడ్డం ఈ అమ్మాయికి అసలైన అందం. కానీ కొన్నిసార్లు అది చాలా తంటాలు తెచ్చి పెడుతోందీ భామకు. నిజాలకు కాస్త మేకప్ వేసి మాట్లాడే నేటి జనరేషన్​లో నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతుంది కల్పిక. ఇలాంటి వ్యక్తిత్వం వల్లే ఆమె రీసెంట్​గా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.కల్పిక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. సామాజిక విషయాల పట్ల స్పందిస్తుంది. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కల్పిక తనకు ఎదురైన ఓ సంఘటన గురించి మాట్లాడారు. ఈ క్రమంలో నటుడు అభినవ్ గోమటం తనను ‘ఐటమ్’ అన్నారని చెప్పారు. ఈ విషయంపై ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరోవైపు శ్రీనిధి కాలేజీ ఇష్యూ గురించీ గళం వినిపించారు.

kalpika ganesh
kalpika ganesh

ఈ సంఘటన తర్వాత కల్పికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని కూడా కల్పిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. నిజాలు చెబితే జనాలకు నచ్చడం లేదంటూ పోస్టు చేసింది. కొందరు సోషల్ మీడియా ముసుగులో కొందరు చేస్తున్న వల్గర్ కామెంట్స్‌ను అందరి దృష్టికి తీసుకొచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తప్పుడు విధంగా కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరిని ఎక్స్‌పోజ్ చేయడం స్టార్ట్ చేసింది కల్పిక. ఈ నేపథ్యంలో కొందరు ఆమెను బాగా తిట్టారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ ట్రోల్ చేశారు. సోషల్ తోడేళ్లను ధైర్యంగా ఎదుర్కొంది కల్పిక. వాళ్ల మాటలకు కాస్త కూడా జంకలేదు. ఈ సంఘటనకు వేదికైంది ఇన్​స్టాగ్రామ్. ట్రోలర్స్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోన్న కల్పిక అకౌంట్​ను సడెన్​గా బ్లాక్ చేసింది ఇన్​స్టాగ్రామ్. నవంబర్ 25న ఆమె అకౌంట్ సస్పెండ్ అయినట్లు కల్పిన తన ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపింది.

”మే 24న నాకు బ్లూ టిక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌కు థాంక్స్. నవంబర్ 25న నా అకౌంట్‌ను రిస్ట్రిక్ట్ చేశారు. ఈ ఆరు నెలల డేటింగ్ పీరియడ్ బాగా గడిచింది. నిజం చెప్పినందుకు నా జీవితంలో చాలా మంది మగవాళ్ళతో నేను బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌తో కూడా బ్రేకప్ అవుతున్నాను. రిప్ ఇన్‌స్టాగ్రామ్‌. ఇప్పుడు నా జీవితం మిలియన్స్ స్పీడుతో వెళ్తోంది” అని కల్పిక పోస్టు చేసింది.