రాశిఖన్నా : ఆ హీరోతో బెడ్రూం సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాశీఖన్నా..

- Advertisement -

రాశిఖన్నా : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న చిత్రాలను చకచకా పూర్తి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె హిందీలో యోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట సందడి చేస్తోంది. రాశీఖన్నా మొదటి సారి ఈ చిత్రంలో బోల్డ్ గా కనిపించనుందని అంటున్నారు.

రాశిఖన్నా
రాశిఖన్నా

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా నటిస్తున్నారు. హాలీవుడ్ సినిమా తరహాలో హీరో హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు హద్దు మీరే అవకాశం కూడా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విమానంలో జరిగే ఘటనలు శృంగార సన్నివేశాలు కాస్త బోల్డ్ గా ఉండనున్నాయని అంటున్నారు. రాశి తోపాటు దిశ పటానికి కూడా హీరోయిన్గా నటిస్తున్నది. ముఖ్యంగా విమానం హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఇందులో సిద్ధార్థ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.

రాశిఖన్నా టాలీవుడ్
రాశిఖన్నా టాలీవుడ్

ఈ సినిమా కోసం రాశి ఖన్నా అన్ని రకాలుగా సిద్ధపడినట్లు తెలుస్తోంది. బెడ్ రూమ్ సన్నివేశాలకు మించి ఇందులో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా రాశి ఖన్నా తనకు పాత్ర నచ్చితే ఎలాంటి సన్నివేశాలలో అయినా నటిస్తానని చెప్పింది. యోధ లో రాశి రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పటినుంచే అందరిని ఆసక్తికరంగా పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి అలాంటి సన్నివేశాల్లో రాశీ ఎలా నటించిందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here