సింహాద్రి రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు.. పవన్ కళ్యాణ్ ఖుషి రికార్డ్స్ సేఫ్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.రాజమౌళి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిన ఈ చిత్రం నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేసారు.

సింహాద్రి రీ రిలీజ్
సింహాద్రి రీ రిలీజ్

సుమారు వెయ్యికి పైగా వరల్డ్ వైడ్ షోస్ తో కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యగా, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో ఆల్ టైం టాప్ 2 చిత్రం గా సింహాద్రి నిలిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లు నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం.

Kushi SImhadri movie

నైజాం లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ లో 75 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యలేదని చెప్తున్నారు. ఖుషి చిత్రం వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చెయ్యగా, సింహాద్రి చిత్రం 4 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.

- Advertisement -
Simhadri movie

ఇది అద్భుతమైన వసూళ్లే అయ్యినప్పటికీ నెల రోజుల నుండి చేసిన పబ్లిసిటీ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేసిన ఖర్చులు వీటితో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పాలి. గుంటూరు , సీడెడ్ మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పగా, మిగిలిన అన్నీ ప్రాంతాలలో ఖుషి మరియు జల్సా నే ఇప్పటికి టాప్ లో ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here