Shruti Haasan : నన్ను బాగా అపార్థం చేసుకున్నారు.. ఏడిపించేసిన శ్రుతి హాసన్



Shruti Haasan : స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దొరికినప్పుడు హీరోయిన్లు ఆనందంతో ఎగిరి గంతేయాలా? ఏజ్‌ లెక్కలేసుకుంటూ కూర్చోవాలా? తాము రాసుకున్న కథకు ఫలానా హీరో, ఫలానా హీరోయిన్‌ అయితే పక్కాగా సరిపోతారని డైరక్టర్‌ ఫిక్స్ అయ్యాక, మీనమేషాలు లెక్కబెట్టుకోవాల్సిన అవసరం నాయికలకు ఉంటుందా? ఈ విషయాల మీద లేటెస్ట్ గా స్పందించారు స్టార్‌ డాటర్‌ శ్రుతి. ఈ విషయాల మీద తాజాగా స్పందించిన Shruti Haasan ట్వీట్ ద్వారా తన ఆవేదన తెలిపింది.

Shruti Haasan
Shruti Haasan

‘‘ప్రస్తుతం నా జీవితంలో నేను అత్యున్నత దశలో ఉన్నాను. ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఎంతో గొప్పగా ఎదుగుతున్నా. నా జీవితం ఇంత అందంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. వీటన్నింటితో పాటు నాకు ఒక విషయం అర్థమైంది. మనల్ని అపార్థం చేసుకునే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అలాగే ప్రేమను చూపించే వాళ్లు కూడా ఉంటారు’’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే శ్రుతి హాసన్‌ రెండు సూపర్‌ హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణతో కలిసి ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమాల్లో నటించి అలరించింది.

Shruti Haasan Photos

ఇక సినిమాలకు సైన్స్ చేయడంపై మాట్లాడుతూ..సినిమాకు సైన్‌ చేసేటప్పుడు కథేంటి? నా పాత్ర ఏంటి? అని ఆలోచిస్తానే తప్ప, ఆ సినిమాలో హీరో ఎవరు? అతని డేట్‌ ఆఫ్‌ బర్త్ ఏంటి? నా వయసెంత? ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంత ఉంది? అనే విషయాలను అసలు పట్టించుకోను.

ఆ లెక్కలన్నీ డైరక్టర్‌వి. ఒక్కసారి ఫిల్మ్ మేకర్స్ ఓకే అనుకున్నాక, దాని గురించి పట్టించుకోవడం అనవసరం అని చెప్పారు. లెజెండ్స్ తో పనిచేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. చిరంజీవి, బాలయ్య నా దృష్టిలో లెజెండ్స్. వాళ్లతో పనిచేయడం హ్యాపీగా ఉంది అని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్‌లో నటిస్తున్నారు శ్రుతిహాసన్‌. ప్రశాంత్‌నీల్‌ సృష్టించిన లోకం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. కేజీయప్‌ కాన్సెప్ట్ కి, ఆ వరల్డ్ కి తాను పెద్ద ఫ్యాన్‌ని అని అన్నారు శ్రుతిహాసన్‌