Shriya Saran : ఆ పార్ట్​కు సర్జరీ చేయించుకోబోతున్న శ్రియ.. రిస్క్ అంటున్న…

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్నా.. డైరెక్టర్లు, హీరోలు.. ఆఖరికి ప్రేక్షకులు కూడా ముందు అందానికే ఓటేస్తారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. అందం ఉండగానే వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు హీరోయిన్లు. అయితే ఈ అందానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దితేనే ఫ్యాన్స్​ని ఫిదా చేయొచ్చని భావిస్తుంటారు. అందుకే రకరకాల సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఈ సర్జరీలు ఫెయిల్ అయి అందవిహీనంగా తయారవుతారు. మరికొన్నిసార్లు ఏకంగా ప్రాణాలే పోవచ్చు. అలా చాలా మంది అందవిహీనంగా తయారై తమ కెరీర్​ను ఎండ్ చేసుకున్నారు. మరికొంత మంది ఏకంగా ప్రాణాలే కోల్పోయారు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రియా శరణ్ Shriya Saran కూడా ఓ సర్జరీ చేయించుకోవాలనుకుంటోదట.

Shriya Saran
Shriya Saran

పర్​ఫెక్ట్ కొలతలతో స్లిమ్ అండ్ ఫిట్​గా ఉండే శ్రియకు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏంటని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంత అందంగా ఉన్నా.. ఎంతగా అందాలు ఆరబోసినా.. సరైన పాత్రలు.. ఆఫర్లు రావడం లేదు. అందుకే తన అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి సర్జరీ చేయించుకోవాలని ఫిక్స్ అయిందట ఈ భామ. శ్రియా శరణ్.. తన ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకోబోతుందట.

- Advertisement -
Shriya

ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతోంది. శ్రియ తన నాభికి సర్జరీ చేయించుకోబొతుందట. తన నాభి సైజ్ చాలా చిన్నగా ఉందని.. కొంచెం సెక్సీగా తయారవ్వడానికి దాని సైజ్ పెంచుకోడానికి ఆమె ట్రై చేస్తోందని సమాచారం. దీని కోసం అడ్వాన్డ్స్ టెక్నాలజీతో కూడిన ఓ హాస్పిటల్​ను సెలక్ట్ చేసుకుందట ఈ బ్యూటీ. పక్కా ప్లాన్ ప్రకారం అత్యంత జాగ్రత్తగా ఈ పని చేయబోతుందట.

శ్రియ సర్జరీ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందంగానే ఉన్నావ్​గా ఇంకా ఎందుకు ఈ ఆరాటం అంటూ కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరేమో దేవుడిచ్చిన సౌందర్యంతో హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ.. ఫ్యామిలీతో హ్యాపీగా గడపొచ్చుగా అంటూ సలహాలిస్తున్నారు.

ఇష్టం సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది శ్రియ. ఆ తర్వాత టాప్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, చిరంజీవిలతో కలిసి నటించింది. వరుస బ్లాక్​బస్టర్​లు అందిస్తూ ఓ ఫేజ్​లో టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ అనిపించుకుంది. యంగ్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబుతో కూడా ఈ బ్యూటీ నటించింది. ఒకప్పుడు గోల్డెన్ హీరోయిన్​గా గుర్తింపు పొందింది శ్రియ.

కొద్దిరోజుల పాటు అవకాశాలు లేక శ్రియ ఫేడ్ అవుట్ అయిపోయింది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్​లో చిన్న చిన్న పాత్రలే వస్తున్నాయి శ్రియకు. అందుకే మళ్లీ తనేంటో తెరపై చూపించాలని ఆరాటపడుతోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే సర్జరీ చేయించుకోవాలనుకుంటోందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here