Sheela Kaur : పరుగు హీరోయిన్ ‘షీలా’ ఇలా మారిపోయిందేంటి..? అసలు గుర్తుపట్టలేకున్నాం కదా!

- Advertisement -

Sheela Kaur : బాలనటులుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎంతో మంది స్టార్ హీరోలుగా మరియు స్టార్ హీరోయిన్లు గా నేడు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్నారు.అలాంటి వారిలో ఒకరు షీలా కౌర్.1995 వ సంవత్సరం లో ‘ఆయుధ పూజై’ అనే తమిళ సినిమా తో ఇండస్ట్రీ లోకి బాలనటిగా అడుగుపెట్టిన ఈమె నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..

Sheela Kaur
Sheela Kaur

చిన్న పాప అయ్యినప్పటికీ కూడా ముద్దులొలికే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు హావభావాలతో మంచి పేరు తెచ్చుకుంది.తొలి సినిమానే ఆమెకి ఆ రేంజ్ గుర్తింపుని తెచ్చిపెట్టడం తో దర్శక నిర్మాతలు ఈమెని బాలనటిగా తమ సినిమాల్లో తీసుకునేందుకు క్యూ కట్టేసారు.అలా ఆమె బాలనటిగా తమిళం లో 12 కి పైగా చిత్రాలలో నటించింది.చిన్నతనం లోనే స్టార్ కిడ్ గా అవతరించింది.2002 వ సంవత్సరం లో సూర్య హీరో గా నటించిన ‘ఉన్నై నేనేతు’ అనే సినిమానే ఈమె బాలనటిగా నటించిన ఆఖరి చిత్రం.

Actress Sheela Kaur

ఆ తర్వాత నాలుగేళ్ల పాటు గ్యాప్ తీసుకొని 2006 వ సంవత్సరం లో ‘సీతాకోక చిలుక’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.నవదీప్ ఇందులో హీరో గా నటించాడు.ఇక ఆ తర్వాత ఈమెకి అటు తమిళం లోను ఇటు తెలుగులోనూ వరుసగా చిన్న హీరోల సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి.అలాంటి సమయం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పరుగు’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది.ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో షీలా కి హీరోయిన్ గా మరికొన్ని అవకాశాలు వచ్చాయి.

- Advertisement -
Actress Sheela Kaur Photos

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలో ఒక హీరోయిన్ గా చేసింది, మంచి గుర్తింపు వచ్చింది కూడా, ఇక ఆ తర్వాత హీరో రామ్ తో చేసిన ‘మస్కా’ సినిమా కూడా ఆమె కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యింది.అలా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సమయం లోనే ఆమెకి సంతోష్ రెడ్డి అనే ప్రముఖ వ్యాపార వేత్తతో వివాహం అయ్యింది.ఇక అప్పటి నుండే ఈమె సినిమాల్లో నటించడం మానేసింది. ఆమె చివరగా వెండితెర మీద కనిపించిన చిత్రం హైపర్. ఇది తెలుగు హైపర్ కాదండోయ్, కన్నడ హైపర్. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా కి దూరంగా ఉంటూ వచ్చే షీలా, ఈమధ్యనే ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను చూసిన ప్రతీ ఒక్కరు అప్పటికంటే ఇప్పుడే ఈమె బాగుంది కదా అంటూ కామెంట్స్ చెయ్యడం ప్రారంభించారు. ఆ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here