Kiara Advani : ప్రాణాలను ఫణంగా పెట్టిన కియారా.. రిస్క్ అవసరమా అంటున్న ఫ్యాన్స్

- Advertisement -


Kiara Advani : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో నటిస్తూ బిజీగా ఉంది. కియారా తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో నటిస్తోంది. ఐతే ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘డాన్ 3’ ఒకటి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ కలిసి వెండితెరపై సందడి చేయలేదు. మరి… వీరి కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి.

అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి కియారా మీడియాతో మాట్లాడింది. ‘డాన్ 3′ నా కెరీర్‌లో ఓ ప్రత్యేక చిత్రం. ఈ సినిమాలో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. యాక్షన్ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ సినిమాలో కోని సన్నివేశాల్లో నటించాను. ఇంకా చాలా సీన్స్ చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర పేరు రోమా. ఈ పాత్రలో మీరు తప్పకుండా కొత్త కియారాను చూస్తారు.. ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో చూడాలనుకుంటున్నాను’ అని కియారా అద్వానీ తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here