Animal Heroine Tripti Dimri : యానిమల్‌ బ్యూటీతో వున్న ఫోటోను షేర్‌చేసిన ప్రియుడు..

- Advertisement -

Animal Heroine Tripti Dimri : ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ యాక్టర్ అయిపోయిన బ్యూటీ త్రిప్తి దిమ్రీ. ఇండస్ట్రీలో ఈ క్యూటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో తన బోల్డ్ యాక్టింగ్ తో న్యూడ్ గా నటించి కుర్రాళ్ల మనసు దోచుకుంది. ‘జోయా’ పాత్రలో లక్షలాది మంది యువత హృదయాలను దోచుకుంది. అలాగే, IMDb (ఇండియన్ మూవీ డేటాబేస్) ఇటీవల మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. అంతలా యానిమల్ సినిమాతో ఆకట్టుకున్న ఆమెకు ఎన్నో అవకాశాలు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇంకా ఏ సినిమాని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిబ్రవరి 23 త్రిప్తి డిమ్రీ పుట్టిన రోజు. 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Animal Heroine Tripti Dimri

ఈ క్రమంలో ఆమె బాయ్ ఫ్రెండ్ సామ్ మర్చంట్ కూడా ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ ఇచ్చాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో త్రిప్తితో సెల్ఫీని పంచుకున్నాడు.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. “నా ప్రియమైన త్రిప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ క్యాప్షన్ రాసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ వైరల్ అవుతోంది. దీంతో త్రిప్తి దిమ్రీ లవ్ మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సామ్ మర్చంట్ ఎవరు? అని త్రిప్తి డిమ్రీని నెటిజన్లు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దొరికిన సమాచారం ప్రకారం సామ్‌మర్చంట్‌ మొదట మోడల్ గా పనిచేశాడు. ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. గోవాలోని బీచ్ క్లబ్‌లతో పాటు పలు హోటళ్లను కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు త్రిప్తి డిమ్రీ – సామ్ మర్చంట్ తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here