Shahrukh Khan : ఏంటయ్యా.. షారుఖ్ ఖాన్.. చివరికి నువ్వు కూడానా..?

- Advertisement -

Shahrukh Khan : ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అనుకునేవారు. కానీ ఇండియాలో చాలా చిత్రపరిశ్రమలున్నాయనే సంగతి బయటి ప్రపంచానికి తెలియదు. అందులో సౌత్ ఇండస్ట్రీ గురించి అసలు తెలియదు. అలాంటి సౌత్ ఇండస్ట్రీని.. ఓ బాహుబలి, ఓ కేజీపఎఫ్, ఓ ఆర్ఆర్ఆర్, ఓ కాంతార సినిమాలు.. బాలీవుడ్ కే కాదు.. ప్రపంచానికి తమ సత్తా ఏంటో చూపించాయి. సినిమాలంటే ఇవి కదా.. కంటెంట్ అంటే ఇది కదా.. డైరెక్షన్ అంటే ఇదీ అని మాట్లాడుకనేలా చేశాయి.

Shahrukh Khan
Shahrukh Khan

ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రపంచం చూపంతా తెలుగు ఇండస్ట్రీపై పడింది. అప్పటికే బాలీవుడ్ డైరెక్టర్లు.. హీరోలు.. ఇక్కడ హిట్ అయిన సినిమాలు అక్కడ రీమేక్ చేసుకుని పైసలు సంపాదించుకునే వారు. కానీ బాహుబలి తర్వాత హిందీ పరిశ్రమలో తెలుగు సినిమాల రీమేక్ లు ఎక్కువయ్యాయి. ఇక ఆర్ఆర్ఆర్.. మూవీతో టాలీవుడ్ సత్తా ఏంటో ఇంటర్నేషనల్ లెవెల్ గా ఫుల్ క్లారిటీ వచ్చింది.

ఇన్నాళ్లూ.. తెలుగు పరిశ్రమనా.. అని చిన్నచూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు తమ స్టార్ హీరోల సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తోంది. మన సంస్కృతికి సంబంధించి మూలాలు బాలీవుడ్ సినిమాల్లో కనిపించడం లేదని పలువురు బాలీవుడ్ ప్రముఖులే బాహాటంగా విమర్శలు చేస్తున్న వేళ బాలీవుడ్ చాలా లేటుగా కళ్లు తెరిచింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని వారి సంస్కృతి సంప్రదాయాలకు బాలీవుడ్ సినిమాల్లో పెద్ద పీట వేసినప్పుడే హిందీ సినిమాకు మంచి రోజులొస్తాయని కాస్త ఆలస్యంగా గ్రహించింది. దీనికి ప్రత్యేక నిదర్శనమే షారుక్ ఖాన్ తను నటించిన `పఠాన్` సినిమాని ప్రమోట్ చేసుకుంటున్న తీరు.

- Advertisement -


బాలీవుడ్ గత కొంత కాలంగా ప్రాంతీయ సినిమాలని చిన్న చూపు చూసిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు హిందీ పరిశ్రమ తమ సినిమా దేశ వ్యాప్తంగా వున్న అన్ని ప్రాంతాల వారిని చేరాలంటే ముందు వాళ్లను ఆకర్షించాలనే విషయం గ్రహించింది. ఏదో డబ్ చేసి పారేస్తే చూస్తారనే అహంకారాన్ని వీడి.. ఇదీ మేం చేసిన సినిమా.. దీన్ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నామంటూ.. ప్రాంతీయ భాషల ప్రేక్షకులను అర్థిస్తోంది. దీన్ని బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కూడా గ్రహించారు. ప్రాంతీయ భాషలతో పాటు కలిసిపోవాలనే విషయం గ్రహించి మార్పునకు శ్రీకారం చుట్టారు.

Actor Shahrukh Khan
Actor Shahrukh Khan

తను నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ `పఠాన్` జనవరి 25న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది వారిని కూడా ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో  బెట్టు వీడిన షారుక్ ఖాన్ ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో త్వరలో ప్రసారం కానున్న సీరియల్స్ కు ప్రచారం చేస్తూ `పఠాన్` ని ప్రమోట్ చేసుకుంటుండటం గమనార్హం. గతంలో ఇలా ఏ బాలీవుడ్ స్టార్ తెలుగు సీరియల్ కు ప్రచారం చేస్తూ తన సినిమాని ప్రమోట్ చేసుకోలేదు.

కానీ ఈ సారి కొత్తగా ఓ తెలుగు సీరియల్ ని ప్రమోట్ చేస్తూ షారుక్ తన `పఠాన్` మూవీని ప్రమోట్ చేసుకుంటుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ మానస్ ప్రధాన పాత్రలో నటించిన సీరియల్ కు షారుక్ ప్రమోట్ చేయడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. దక్షిణాది వారి పట్ల బాలీవుడ్ స్టార్స్ లో వచ్చిన మార్పుని చూసి మురిసిపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here