BB Jodi : చివరి నిమిషం లో విన్నర్స్ పేర్లని మార్చేసిన ‘BB జోడి’ టీమ్.. ఇంకెన్ని అన్యాయాలు చూడాలో!

- Advertisement -

BB Jodi : స్టార్ మా ఛానల్ లో ఈమధ్య ప్రసారం అవుతున్న రియాలిటీ షోస్ మరియు గేమ్ షోస్ చాలా అన్యాయం గా జరుగుతున్నాయనే వాదన ఉంది.గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మొత్తం అన్న ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగాయి.ఇప్పుడు రీసెంట్ గా ‘BB జోడి’ అనే ప్రోగ్రాం లో కూడా అదే జరిగింది.బిగ్ బాస్ హౌస్ పాత కంటెస్టెంట్స్ లోని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొని పది జోడీలుగా మార్చి ఈ షో ని చేసారు.తొలుత పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

కానీ ఈ జోడీలు అద్భుతంగా డ్యాన్స్ చెయ్యడం ప్రారంభించిన తర్వాత TRP రేటింగ్స్ అదిరిపొయ్యే రేంజ్ లో వచ్చాయి, దాంతో షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.అంత బాగానే ఉంది కానీ నిన్న గ్రాండ్ ఫినాలే లో జరిగింది మాత్రం పూర్తిగా అన్యాయం అంటున్నారు నెటిజెన్స్.

ఎందుకంటే మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ వచ్చిన జోడీలు ఎవరూ అంటే, అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు అర్జున్ కళ్యాణ్ – వాసంతి మరియు మెహబూబ్ – శ్రీ సత్య.ఈ రెండు జంటలే మొదటి నుండి ఈ ఎపిసోడ్ కి ఆయువు పట్టులాగా ఉంటూ వచ్చారు.అలాంటి కంటెస్టెంట్స్ కి టైటిల్ ఇవ్వకుండా ఫైమా – సూర్య జంటకి టైటిల్ ఇవ్వడం ఎవ్వరికీ నచ్చలేదు.

- Advertisement -

అంతే కాదు ,ఈ జోడీ గెలిచినందుకు గాను పాతిక లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చింది BB జోడి టీం.మరోపక్క నెటిజెన్స్ బిగ్ బాస్ గత సీజన్ లాగానే ఇక్కడ కూడా దారుణమైన మోసం జరిగిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.జనాలు మెచ్చుతున్న కంటెస్టెంట్స్ ని పక్కన పెట్టి, మ్యానేజ్ మెంట్ క్వాటా లో వచ్చిన కంటెస్టెంట్స్ కి ఇస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here