Mahesh Babu : మహేష్ సిగరెట్ కొడితే ఇండస్ట్రీ హిట్టేనా..? సెంటిమెంట్ భలే కలిసొచ్చిందిగా!

- Advertisement -

సూపర్ స్టార్ Mahesh Babu కి కొన్ని సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయని ఫ్యాన్స్ బలంగా నమ్ముతారు.ముఖ్యంగా ఆయన పంచె కట్టు కడితే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయి అని అంటుంటారు.పోకిరి, శ్రీమంతుడు మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలలో మహేష్ పంచె కట్టు కట్టి ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆదుకున్నాడు.

Mahesh Babu
Mahesh Babu

పంచెకట్టు తో పాటు మహేష్ సినిమాలకు మరో సెంటిమెంట్ కూడా ఉంది, అలాగే మహేష్ సిగరెట్ తాగినప్పుడు కూడా సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ఉదాహరణకి పోకిరి ని తీసుకోవచ్చు, ఈ చిత్రం లో మహేష్ సిగరెట్ తాగే స్టైల్ అప్పట్లో పెద్ద ట్రెండ్.అంతకు ముందు మహేష్ ని స్టార్ గా చేసిన ‘ఒక్కడు’ సినిమాలో కూడా సిగరెట్ తాగుతాడు.మధ్యలో అతిథి అనే చిత్రం లో కూడా సిగరెట్ తాగుతాడు కానీ,ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

SSMB 28

అయితే మహేష్ నిజ జీవితం లో కూడా పెద్ద చైన్ స్మోకర్.ఒక రోజుకి నలభై సిగరెట్లు కాల్చేవాడట.కానీ మధ్యలో ఒక బుక్ చదివిన తర్వాత ఆయన సిగెరెట్ తాగడం పూర్తిగా మానేసాడు.అంతే కాదు , సినిమాలలో కూడా ఇక నుండి సిగరెట్స్ తాగను అని మాట ఇచ్చాడు.ఇచ్చి మాట ప్రకారమే ఇన్ని రోజులు సినిమాలలో సిగరెట్స్ ముట్టుకోలేదు.మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సిగరెట్ తాగడం ఇదే తొలిసారి.

- Advertisement -
MASS LOOK IN SSMB 28

మహేష్ ని ఈ లుక్ లో చూసిన ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. పోకిరి లాగానే ఈ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తుందా, లేదా అతిథి చిత్రం లాగ కేవలం ఓపెనింగ్స్ కి పరిమితం అవుతుందా అనేది తెలియాలంటే జనవరి 13 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి ‘అమరావతికి అటు ఇటు‘ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here