Anchor Sowmya : నటిగా కెరీర్ మొదలుపెట్టిన సౌమ్య రావు జబర్దస్త్ షోతో యాంకర్‌గా మారింది. పైకి నవ్వుతూ, పంచులు విసురుతూ చలాకీగా కనిపించే ఆమె జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉంది..తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూయడం ఆమెను ఎంతగానో కుంగదీసింది. చివరి రోజుల్లో తల్లి అనుభవించిన నరకాన్ని చూసి తల్లడిల్లిపోయింది.. గతంలో జరిగిన ఓ షో లో తన తల్లి అనుభవించిన బాధ గురించి చెప్పి అందరిని ఏడ్పించింది.. తాజాగా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీలో తల్లిని చూసి స్టేజ్ పైనే గుక్క పెట్టి ఏడ్చింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జబర్దస్త్ యాంకర్ అయిన సౌమ్య రావు తన తల్లి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..హైపర్ ఆది మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీషోలో ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమోలో తనదైన పంచులతో నవ్వించాడు. హైపర్ ఆది ఈ ఎపిసోడ్ లో పెళ్లి చూపుల థీమ్ తీసుకున్నాడు. పెళ్లి చూపులకి ఆర్టిస్టులంతా కలిసి తన కుటుంబంలా వచ్చారని అనడంతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ‘ఊ అంటావా మావ’ సింగర్ ఇంద్రావతి చౌహన్ పాడిన ఫోక్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.ఆది రెయిన్ డ్యాన్స్ చేశాడు. జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో కలిసి ‘వాన వల్లప్ప వల్లప్ప’ పాటకి స్టెప్పులు వేశాడు. అయితే ప్రోమో చివర్లో ఆది సౌమ్య రావు కోసం ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పి, గిఫ్ట్ ఇస్తాడు. సౌమ్య గిఫ్ట్ కవర్ తెరచిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది.
తన తల్లితో ఉన్న ఫ్రెమ్ ను తెచ్చి ఇస్తాడు..గిఫ్ట్ కవర్ తెరచిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. సౌమ్య రావ్ తన తల్లితో ఉన్న ఫోటోను ఆది ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. అప్పుడు ఆమె తల్లి ఫోటోలను ప్లే చేయడంతో వాటిని చూసిన సౌమ్య తన తల్లి గురించి చెప్తు బోరున ఏడ్చేసింది.అమ్మకి విపరీతమైన తలనొప్పి వచ్చిందని, హాస్పిటల్‌కి తీసుకెళ్లడంతో డాక్టర్లు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. అమ్మ తనెవరో తెలియనంతగా గతాన్ని మర్చిపోయిందని చెప్పింది. మూడున్నర ఏళ్లు అమ్మని బెడ్ మీదనే చూసుకున్నానని కానీ ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.. సౌమ్యను చూసిన వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రమె కాదు అందరు సౌమ్యను ఓదారుస్తున్నారు్.. మొత్తానికి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..