వామ్మో.. జబర్దస్త్ సౌమ్య ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా..

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ షో గత కొన్నేళ్లు తెలుగువారిని అలరిస్తోంది. మొదట యాంకర్‌గా అనసూయ వచ్చింది. ఆ తర్వాత రష్మి కొన్నేళ్లు చేసింది. ఇక యాంకర్ అనసూయ ఏవో కారణాలతో జబర్దస్త్‌ను వదిలిపోయింది. ఈ క్రమంలో కొత్త యాంకరమ్మ సౌమ్య ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు కూడా ఏమాత్రం తగ్గట్లేదు.

జబర్దస్త్ సౌమ్య
జబర్దస్త్ సౌమ్య

ఈ భామ ఈటీవీలో వచ్చే శ్రీ‌మంతుడు సీరియ‌ల్ తో పాపుల‌ర్ అయ్యింది. అయితే ఈ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుస్తోన్న సమాచారం ప్రకారం సౌమ్య రావు‌కు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి 60 వేలు ఇస్తున్నారట. అయితే ఆమె పెర్ఫార్మన్స్, మాట, ఆకట్టుకునే తీరును బట్టి పెంచుతామని హామీ ఇచ్చారట నిర్మాతలు. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ రెమ్యూనరేషన్ రష్మీ-అనసూయల రెమ్యూనరేషన్ కంటే తక్కువేని టాక్. మరోవైపు ఈ కొత్త యాంకర్ ఏమాత్రం అనసూయ, రష్మిలను మరిపిస్తుందంటున్నారు కొందరు ఫ్యాన్స్.

Jabardasth sowmya

తెలుగు టెలివిజ్‌ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి.. జబర్దస్త్‌ షో జడ్జిగా… ఎట్ ప్రజెంట్ రాణిస్తున్నారు. పంచ్‌లతో.. ఫన్నీ కామెంట్స్‌తో… సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ.. ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ నుంచి కాల్ అందుకున్నారట ఈ బ్యూటీ. ఓ స్టార్ హీరో చేసే పాన్ ఇండియన్ సినిమాలో.. కాస్త పేరున్న రోల్ చేసే.. బంపర్ ఆఫర్ కొట్టేశారట. ఇప్పుడు ఇదే న్యూస్‌ బుల్లి తెర సర్కిల్లో తెగ వైరల్ అవుతోంది. అలా సోషల్ మీడియాకూ కూడా ఎక్కి.. సౌమ్యా రావ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పేవరకు వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here